- Advertisement -
హైదరాబాద్: ఉద్యోగుల వేతన సవరణ ప్రతి ఐదు సంవత్సరాల ఒకసారి చేసుకుంటున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. బడ్జెట్ పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో కెసిఆర్ మాట్లాడారు. కరోనా వల్ల ఈ సారి వేతన సవరణ ఆలస్యమైందన్నారు. ఉద్యోగుల హక్కులను గౌరవిస్తున్నామని, 80 శాతం ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయిందని, ప్రమోషన్ల తరువాత ఏర్పడే ఖాళీలను భర్త చేస్తామని ప్రకటించారు. తెలంగాణలో పని చేస్తున్న ఎపి ఉద్యోగులు తమ సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నామని స్పష్టం చేశారు. అన్ని రకాల ఉద్యోగుల వేతనాలు పెంచుతున్నామని, అంతర జిల్లా బదిలీల ప్రక్రియను చేపడుతామన్నారు. ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్ ఇస్తామని సిఎం కెసిఆర్ ప్రకటించారు. పదవీ విరమణ వయస్సు 61 ఏళ్లకు పెంచారు.
- Advertisement -