యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా ఎస్వీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఫణి ప్రదీప్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎస్.వి.బాబు నిర్మించిన చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’. అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ ఆడి యో మ్యూజికల్ హిట్‌గా నిలిచి 300 మిలియన్స్ వ్యూస్ సాధించిం ది. శుక్రవారం ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా అత్యధిక థియేటర్స్‌లలో యువి, జిఏ 2 సంస్థల ద్వారా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. కాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు అనిల్ రావిపూడి, మారుతీ, హీరోలు కార్తికేయ, అడవి శేష్, ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్, హీరో ప్రదీప్ మాచిరాజు, హీరోయిన్ అమృత అయ్యర్, ఫణి ప్రదీప్, అనూప్ రూబెన్స్, శివేంద్ర, సింగర్స్ సిద్ శ్రీరామ్, కమేడియన్స్ సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్, మహేష్, భద్రం తదితరులు పాల్గొన్నారు.
అనంతరం అనిల్ రావిపూడి, మారుతి, కార్తికేయ, అడవి శేష్ సంయుక్తంగా ప్లాటినం డిస్క్‌లను ఆర్టిస్టులకు, టెక్నీషియన్స్‌కి అందించారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ “ప్రదీప్ ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాడు. ఈ సినిమా మంచి హిట్ అయి అతనికి ఉజ్వల భవిష్యత్తును అందించాలి. ఈ సినిమాలోని ‘నీలి నీలి పాట…’ వన్ ఇయర్ నుండి స్టిల్ రన్నింగ్ అవుతూ శ్రోతలను అలరిస్తోంది. అనూప్ టీమ్‌కి కంగ్రాట్స్. ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. చిత్ర హీరో ప్రదీప్ మాచిరాజు మాట్లాడుతూ “మున్నా కథ చెప్పినప్పుడు నేను చేయగలనా అనే భయం వేసింది. ప్రతిక్షణం మున్నా నా వెంట ఉండి.. నువ్వు చేయగలవు… అని ప్రోత్సహిస్తూ నా మీద నమ్మకంతో ఈ సినిమాలో చేసే అవకాశం ఇచ్చాడు. అతను ఈ చిత్రాన్ని అందరికీ నచ్చేలా అద్భుతంగా తెరకెక్కించాడు.
అనూప్ ఈ సినిమాకి మెయిన్ పిల్లర్. ఎక్స్ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చాడు. జీవితాంతం గుర్తుండిపోయేలా ‘నీలి నీలి…’ పాటనిచ్చాడు. చక్కని లిరిక్స్ రాసిన చంద్రబోస్, అనంత్ శ్రీరామ్‌లకు నా థాంక్స్”అని చెప్పారు. చిత్ర దర్శకుడు ఫణి ప్రదీప్ మాట్లాడుతూ “నీలి నీలి పాట 300 మిలియన్స్ దాటి ఇంకా ట్రెండింగ్‌లో ఉంది. అంతలా హిట్ అయింది. చాలా రోజుల తర్వాత ఆడియో ప్లాటినం డిస్క్ అందుకోవడం చూస్తుంటే ఆనందంగా ఉంది. ఎన్ని ఓటిటి ప్లాట్‌ఫామ్ ఆఫర్స్ వచ్చి నా రిలీజ్ చేయకుండా మా కష్టాన్ని గుర్తించి బాబు ఇప్పుడు థియేటర్స్‌లో ఈ సినిమాని విడుదల చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అని చెప్పారు. చిత్ర నిర్మాత ఎస్.వి.బాబు మాట్లాడుతూ “ఈ నెల 29న మా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా జిఏ 2, యువి సంస్థలు ద్వారా రిలీజ్ చేస్తున్నాం. ప్రదీప్, అమృత ఇద్దరూ అద్భుతంగా నటించారు. నీలి నీలి పాట అందరినీ అలరిస్తోంది. ఈ క్రెడిట్ అంతా అనూప్కే దక్కుతుంది”అని అన్నారు.