Monday, December 23, 2024

విద్యుత్ షాక్‌కు గురై 30 గొర్రెలు మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/చింతకాని : మండల పరిధిలోని నామవరం వల్లాపురం గ్రామాల మధ్యలో ఉన్న మున్నేరులో వల్లాపురం గ్రామానికి చెంది న ఓ రైతు వ్యవసాయ పనుల నిమిత్తం మున్నేరులో నిల్వ ఉన్న నీటిలో విద్యుత్ మోటా ర్ అమర్చడంతో విద్యుత్‌షాక్‌కు గురై 30 గొర్రెలు మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది. మండల పరిధిలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన చిర్ర రామయ్య, చిర్ర వెంకయ్య, సీతయ్య, చెవుల పుల్లయ్యలకు చెందిన సుమారు 30 గొర్రెలు మున్నేరులో మేతకు వెళ్ళి ప్రతి సంవత్సరం ఉగాదికి ముందు గొర్రెలను మున్నేరులో ఉన్న నీటిలో శుభ్రంగా కడిగి తమ కుల దేవతకు పూజలు చేసుకుంటామని ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పూజా కార్యక్రమాలు చేపట్టేందేకు నామవరం వల్లాపురం మధ్యలో ఉన్న మున్నేరులో ఉన్న నీటిలో గొర్రెలను తీసుకెళ్లామని, ఇంతలో వల్లాపురం గ్రామానికి చెందిన రైతు మున్నేరులో ఉన్న నీటిలో అక్రమంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ విద్యుత్ మోటార్‌కు కరెంట్ రావడంతో మొత్తం గొర్రెలు కరెంట్ షాక్‌కు గురై మృతిచెందడం జరిగిందన్నారు. దీంతో గొర్రెల కాపరులు లబోదిబోమంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News