Monday, January 20, 2025

30మంది విద్యార్థులకు అస్వస్థత

- Advertisement -
- Advertisement -

మంచాల: కలుషిత ఆహారం తిని 30 మంది విద్యార్థినీలు తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన మంచాల మండల కేంద్రంలో తీవ్ర కలకలం రేపింది. బీసీ బాలికల వసతి గృహంలో విద్యార్థినీలు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారు. సుమారు 30మంది విద్యార్థినీలు కడుపునొప్పి, విరేచనాలు, వాంతులతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంచాల బీసీ బాలికల వసతి గృహంలో 96మంది విద్యార్థులు ఉంటు విద్యనభ్యసిస్తున్నారు. కాగా వీరికి మూడు రోజుల నుంచి అన్నంలో పురుగులు వస్తున్నాయని హాస్టల్ ఇంచార్జీ వార్డెన్, వర్కర్ల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదు. శనివారం ఉదయం అదే విధంగా పులిహోరలో పురుగులు రావడంతో ఆకలితో కొంతమంది విద్యార్థినీలు తినగా,

మరి కొంతమంది పక్కన పెట్టారు. ఆకలికి తట్టుకోలేక పురుగులను ఏరివేసి అన్నం తిన్న విద్యార్థినీలు వాంతులు, విరోచనాలకు గురయ్యారు. ప్రార్థనా సమయం కావస్తున్నా హాస్టల్ విద్యార్థినీలు ఒక్కరు కూడా పాఠశాలకు చేరుకోలేదు. దాంతో పాఠశాల ఉపాధ్యాయులు హాస్టల్‌కు చేరుకొని విచారించగా వాంతులు కావడంతో హాస్టల్లోనే పడుకుండిపోయారని తెలిసింది. దాంతో అస్వస్థతకు గురైన 30 మంది విద్యార్థినీలను ఉపాధ్యాయులు స్థానిక ప్రభుత్వ తరలించి చికిత్స అందించారు. వీరిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వనస్థలిపురంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.

విద్యార్థులను పరామర్శించిన పిసిసి సభ్యులు మర్రి నిరంజన్‌రెడ్డి
కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులను మంచాల ప్రభుత్వ ఆసుపత్రిలో టిపిసిసి సభ్యులు మర్రి నిరంజన్‌రెడ్డి పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. హాస్టల్‌లలో నాణ్యమైన కురగాయాలు బియ్యం హాస్టల్ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. రాష్ట్రంలో విద్యతో పాటు వైద్యం కూడా బ్రష్టు పట్టిందన్నారు. ప్రభుత్వం విదార్థుల భవిష్యత్తుతో ఆటలడొద్దన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News