Friday, January 24, 2025

అమెరికాలో ఆమె గుండె లబ్‌డబ్ లేకుండా జీవనం

- Advertisement -
- Advertisement -

మస్సాచూసెట్స్ : అమెరికాలో 30 సంవత్సరాల మహిళ సోఫియా హర్ట్ గుండె స్పందన ఏమీ లేకుండానే జీవిస్తోంది. ప్రపంచంలో కోటికొక్కరికి వచ్చే అత్యంత అరుదైన జన్యుపరమైన గుండెసంబంధిత జబ్బుతో ఈ మహిళ బాధపడుతోంది. తాను బ్యాటరీల సాయంతో జీవితం గడుపుతున్నానని సోఫియా తెలిపింది. గుండె సంబంధిత సమస్యలతో ఆమె డాక్టర్ల వద్దకు వెళ్లగా అరుదైన జన్యు బలహీనత ఉందని గుర్తించారు. ఆమెకు ఇప్పుడు నయం కాని కార్డియోమ్యోపతి సోకింది. గుండె సంబంధిత కండరాల అవలక్షణం ఏర్పడింది. ఇది తట్టుకుని ఉండటం కష్టమే. దాదాపుగా గుండెస్పందన లేకుండా పోయింది. అయితే ఇప్పుడు ఆమెకు ప్రాణాధారమైన వైద్య పరికరం ఎల్‌విఎడిపై ఆధారపడింది.

గుండెకండరాలు, రక్తనాళాల ప్రసరణ సంబంధిత సమస్య సోఫియాకు సమస్యగా మారింది. ఆమెకు చివరికి మిగిలింది ఇక కేవలం గుండెమార్పిడినే. అప్పటివరకూ తాను ఈ సాధనంపైనే ఆధారపడి బతుకుతున్నట్లు మహిళ కన్నీటిపర్యంతం అయింది. ఆమె గుండె ఎడమభాగానికి అవసరం అయిన యాంత్రిక పంపింగ్ జరుగుతూ ఉండటం వల్ల ఇప్పటికైతే తాను మనిషిగా ఉనికిలో ఉన్నట్లు అని తెలిపారు. గుర్రాల పెంపకం కేంద్రంలో పనిచేసే ఈ మహిళకు ఈ జబ్బు వచ్చినట్లు గత ఏడాది గుర్తించారు. ఉన్నట్లుండి తాను పూర్తిగా మానసికంగా అలసిసొలిసిపోయినట్లు, శారీరకంగా అంతా బాగానే ఉండేదని, చివరకు వైద్య పరీక్షలలో ఈ అరుదైన గుండె జబ్బు ఉన్నట్లు తేలిందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News