Monday, December 23, 2024

కొత్త అల్లుడికి 300 రకాల వెరైటీ వంటకాలు..

- Advertisement -
- Advertisement -

సంక్రాంతి పండగ అంటే.. ఎపిలోని ఉభయ గోదావరి జిల్లాల్లో ఉండే సందడి.. బహుశా మరెక్కడా ఉండకపోవచ్చు. సంక్రాంతి వచ్చిందంటే.. ఎక్కడ ఉన్నా సరే సొంతూర్లకు వచ్చేస్తారు అక్కడి జనాలు. దీంతో ఊర్లు మొత్తం ఆటపాటలు, కోడిపందాలు, కమ్మని వంటకాలు, ఎద్దుల పోటీలతో ప్రత్యేక శోభ సంతరించుకుంటుంది. ఇక కొత్తల్లుడు ఇంటికొస్తే.. రకరకాల పిండి వంటలు చేసి పెడుతుంటారు.

గోదవారి జిల్లా వాసులు.. కొత్తల్లుడికి వండిపెట్టే వంటకాలతో రికార్డు సృష్టిస్తున్నారు. తాజాగా అనకాపల్లిలో మేము కూడా ఏమాత్రం తక్కువ కాదు అన్నట్లు.. సంక్రాంతి పండగకు ఇంటికొచ్చిన కొత్తల్లుడికి ఏకంగా 300 రకాల పిండి వంటకాలు వడ్డించి వావ్ అనిపిస్తున్నారు. ఆ వంటకాలన్నీ దగ్గరుండి మరీ అల్లుడికి వడ్డించి.. అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చారు. ఈ వంటకాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీళ్ల ప్రేమ చూస్తుంటే.. ఇలాంటి అత్తమమాలు మాక్కూడా ఉంటే ఎంత బాగుటుందోనని నెటిజన్స్ అనుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News