Sunday, January 19, 2025

టమాటా ట్రేలలో రూ.80 లక్షల గంజాయి గుట్టురట్టు

- Advertisement -
- Advertisement -

నాగార్జునసాగర్: పుష్ప సినిమాలో మాదిరిగా నిందితులు కొత్తకొత్త ట్రిక్కులతో పోలీసుల కళ్లుగప్పి గంజాయిని తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్లాన్ కాస్త పోలీసుల నిఘాతో బెడిసికొట్టింది. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో ఆదివారం అర్థరాత్రి ఆంధ్రా, తెలంగాణ సరిహద్దు పోలీస్ చెక్‌పోస్టు వద్ద ఖాళీ టమాటా ట్రేలను తరలిస్తున్న డిసిఎంను పోలీసులు తనిఖీ చేశారు.

తనిఖీలో టమాటా ట్రేలో తరలిస్తున్న సుమారు 300 కిలోల గంజాయిని గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు 168 ప్యాకెట్లో ఈ గంజాయి తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీని విలువ సుమారు రూ. 80 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు నలుగురు నిందితులను అరెస్టు చేశామని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నాగార్జునసాగర్ ఎస్‌ఐ సంపత్‌గౌడ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News