Friday, February 21, 2025

అబ్దుల్లాపూర్‌మెట్‌లో 300 కిలోల గంజాయి పట్టివేత

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: 300 కిలోల గంజాయి పట్టుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆంధ్ర ప్రదేశ్ నుంచి వస్తున్న కంటైనర్‌లో ఎస్‌ఒటి పోలీసులు తనిఖీలు చేయగా 300 కిలోల గంజాయి దొరికింది. వెంటనే కంటైనర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని వాహనాన్ని సీజ్ చేశారు. గంజాయి విలువ దాదాపుగా కోటి రూపాయలు ఉంటుందని మహేశ్వరం పోలీసులు వెల్లడించారు. గంజాయిని విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా మహేశ్వరం ఎస్‌ఒటి పోలీసులు పట్టుకున్నారు. మూడు గంటలకు మీడియా సమావేశంలో పోలీస్ ఉన్నతాధికారులు వివరాలు వెల్లడించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News