Monday, December 23, 2024

మరుభూమి మరియుపోల్

- Advertisement -
- Advertisement -

ఆకలితో అలమటిస్తున్న లక్ష మంది
పౌరులు సామూహిక ఖననాలు
కీవ్ వెలుపల ఇంధన డిపోను
ధ్వంసం చేసిన రష్యా
మెడికల్ సెంటర్‌పై దాడి:
నలుగురు మృతి

డ్రామా థియేటర్‌పై దాడిలో 300మంది మృతి

కాల్పుల విరమణకు భారత్ చైనా పిలుపు
క్లిష్టతపై ఇరుదేశాల దృష్టి

300 Members dead in Russia attack

న్యూఢిల్లీ : ఉక్రెయిన్‌లో తక్షణం కాల్పుల విరమణ జరగాల్సి ఉందని , ఘర్షణ నివారణకు ఇరు పక్షాలూ వెంటనే దౌత్య నీతికి దిగాలని, చర్చలు చేపట్టాలని భారత్ చైనాలు తెలిపాయి. భారతదేశ పర్యటనకు వచ్చిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భారత విదేశాంగ మంత్రి జై శంకర్ చర్చల దశలో ఉక్రెయిన్ విషయం ప్రస్తావనకు వచ్చింది. ప్రపంచస్థాయిలో ఉద్రిక్తతలను రగిలిస్తున్నందున రష్యా ఉక్రెయిన్‌లు పూర్తి సంయమనం పాటించాల్సిందే. ముందు కాల్పులను పరస్పర దాడులను నిలిపివేయాలి. తరువాత చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ చైనాలు పిలుపు నిచ్చాయి. ఇరు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య దాదాప 3 గంటల పాటు చర్చలు జరిగాయి. ఉక్రెయిన్ రష్యా ఘర్షణపై చైనా విదేశాంగ మంత్రి తమ దేశ అవగావహనను తెలిపారు. ప్రస్తుత పరిస్థితిపై దేశ వైఖరిని వెల్లడించారని ఆ తరువాత జైశంకర్ విలేకరులకు చెప్పారు. తాము ఈ అంశంలో భారతదేశ అభిప్రాయాన్ని వివరించామని తెలిపారు. భారత్ చైనా సంబంధాలు ప్రస్తావనకు వచ్చాయని తెలిపిన జైశంకర్ క్వాడ్ విషయం ప్రస్తావనకు రాలేదని స్పష్టం చేశారు. ఐరాస సంస్కరణలు, ప్రత్యేకించి భద్రతా మండలి పునర్వస్థీకరణ వంటి వాటిపై చర్చించినట్లు వివరించారు.

కీవ్: ఉక్రెయిన్ నగరాలపై రష్యా బాం బుదాడులు కొనసాగుతున్నాయి. ఈ దా డుల్లో మరణిస్తున్న పౌరుల సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతోం ది. ప్రధానం గా ఉక్రెయిన్ రాజధాని కీవ్, మరియు పోల్, ఖర్కివ్ నగరాలు లక్షంగా రష్యా బాంబుల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. పదాతి దళాలు ఆశించిన స్థా యిలో పురోగతి సాధించలేకపోవడంతో రష్యా  ఉక్రెయిన్‌లోని ప్రధా న నగరాలపై వైమానిక దాడులతో విరుచుకు ప డుతోంది. ఉక్రెయిన్ వ్యూహాత్మక తీరప్రాంత నగ రమైన మరియుపోల్‌లోని ఓ ్రడ్రామా థియేటర్‌పై గత వారం రష్యా జరిపిన క్షిపణి దాడుల్లో దాదా పు 300 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రత్యక్ష సాక్షు ల కథనం. దీనిని మరియుపోల్ సిటీ హాల్ అధికారులు టెలిగ్రామ్‌లో ధ్రువీకరించారు. ఈ నెల 16న ఈ థియేటర్‌పై రష్యా రెండు సూపర్ బాంబులను ప్రయోగించిం ది. దాడి జరిగిన సమయంలో బాంబు షెల్టర్‌గా ఉపయోగిస్తున్న ఈ థియేటర్‌లో దాదాపు 1,300 మంది తలదాచుకుంటున్నట్లు ఉక్రెయిన్ పార్లమెంటు మానవ హక్కుల కమిషనర్ లుడ్మిలా డెనిసోవా చెప్పారు. థియేటర్ వద్ద పిల్లలు ఉన్నట్లు ఆకాశంనుంచి కూడా స్పష్టంగా కనిపించే విధంగా పెద్ద అక్షరాలతో అక్కడ రాశారు కూడా. అయినా రష్యా ఆ థియేటర్‌పై క్షిపణులతో దాడి చేసిందనే ఆరోపణలున్నాయి. శిథిలాల కిందినుంచి 200 కంటే ఎక్కువ మందిని కాపాడినట్లు నగర డిప్యూటీ మే యర్ సెర్గీ ఓర్లోవ్ తెలిపారు. ఉక్రెయిన్ అధికారులు తమ అధీనంలో ఉన్న ఓడరేవు నగరం మరియుపోల్‌నుంచి పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఈ దాడి జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది. దాదాపు లక్ష మంది పౌరులు నగరంలో చిక్కుకు పోయారని, దాడి అనంతరం మృతదేహాలు, ధ్వంసమైన భవనాలతో ఆ ప్రాంతమంతా నిండిపోయిందని స్థానిక హ్యూమన్ రైట్స్ వాచ్ తెలిపింది. అయితే సహాయక బృందాలు శిథిలాలకిందినుంచి మొత్తం మృత దేహాలను వెలికి తీయడం పూర్తయిందా , 300 మంది చనిపోయారని ప్రత్యక్ష సాక్షులు ఎలా నిర్ధారణకు రాగలిగారనే విషయం మాత్రం స్పష్టం కాలేదు.
నగరంలో భయానక పరిస్థితులు
మరియుపోల్ నగరంలో చిక్కుకు పోయిన పౌరులకు సాయం అందించడాన్ని రష్యా బలగాలు అడ్డుకుంటున్నాయని, ఫలితంగా స్థానికంగా మానవతా పరిస్థితులు క్షీణిస్తూనే ఉన్నాయని నగర మేయర్ వాదియ్ బోయ్‌చెంకో తాజాగా తెలిపారు.‘ పరిస్థితి నిజంగా క్లిష్టంగా ఉంది. రష్యా దాడుల కారణంగా నగరం నాశనమైంది. దీన్ని పునర్నిర్మించడానికి ఏళ్లు పడుతుంది. ఇది మానవతా సంక్షోభమే. నగరంలో కొంత భాగాన్ని రష్యా సేనలు ఆక్రమించుకున్నాయి. అయినా ఇప్పటికి ఉక్రెయిన్ సైనికులు నగరాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నారు. పోరాటం మాత్రం ఆగడం లేదు. దాదాపు లక్ష మంది ఇంకా ఇక్కడే చిక్కుకుని ఉన్నారు. తరలింపు ప్రక్రియ ఒకకటే వారి ప్రాణాలను కాపాడగలదని భావిస్తున్నాం. అందుకోసం ప్రయత్నాలు చేస్తున్నాం’ అని చెప్పారు. కాగా మరియుపోల్ నగరంలో సామూహిక ఖననాలు పెరుగుతున్నట్లు తమకు సమాచారం అదిందని ఉక్రెయిన్‌లోని ఐరాస మానవ హక్కుల బృందం అధిపతి మటిల్డా బోగ్నర్ తెలిపారు. ఒక చోట ఏకంగా 200 మందిని సమాధి చేసినట్లు కనిపించిందని తెలిపారు. ఉపగ్రహ ఛాయాచిత్రాలద్వారా కొన్ని ఆధారాలు సేకరించినట్లు తెలిపారు.
ఖర్కివ్ మెడికల్ సెంటర్‌పై దాడి
మరో వైపు యుద్ధం ప్రారంభమైనప్పటినుంచి బాంబుదాడులు కొనసాగుతున్న ఖర్కివ్ ప్రాంతంలోని ఓ మెడికల్ సెంటర్‌పై రష్యా జరపిన దాడుల్లో నలుగురు పౌరులు మరణించారని, పలువురు గాయపడ్డారని స్థానిక పోలీసులు తెలిపారు. శుక్రవారం ఉదయంనుంచి రష్యా బలగాలు రాకెట్ లాంచర్లతో విరుచుకు పడ్డాయని, ఈ దాడుల్లో ఏడుగురు పౌరులు గాయపడగా వారిలో నలుగురు చనిపోయారని తెలిపారు. దేశ రాజధాని కీవ్ నగరంపై కూడా రష్యా ఎడతెరిపి లేకుండా క్షిపణి దాడులు కొనసాగిస్తోంది. క్షిపణి దాడులతో కీవ్‌కు వెలుపల ఉన్న ప్రధాన ఇంధన డిపోను ధ్వసం చేసినట్లు రష్యా రక్షణ శాఖ శుక్రవారం ప్రకటించింది. గురువారం సాయంత్రం తమ కాలిబర్ క్రూజ్ క్షిపణులను ప్రయోగించి దాన్ని ధ్వంసం చేశామని రక్షణ శాఖ ప్రతినిధి ఇగోర్ కొనాషెంకోవ్ తెలిపారు. దేశం మధ్యలో ఉన్న ఉక్రెయిన్ బలగాలకు ఇక్కడినుంచే ఇంధనం సరఫరా అయిందని ఆయన తెలిపారు.
ఆకలి కేకలు
మరో వైపు చాలా మంది పౌరులు నగరాన్ని వదిలిపెట్టి వెళ్లడంతో చనిపోయిన వారి మృత దేహాలను తీసుకెళ్లే వారు లేక, ప్రధాన స్మశాన వాటికలో పెద్ద సంఖ్యలో శవపేటికలు గుట్టలుగా పడి ఉన్నాయి. ఉక్రెయిన్ ప్రధాన నగరాలనుంచి వెళ్లిన వాళ్లు వెళ్లగా అక్కడే ఉండిపోయిన వారు ఆహారం కొరతతతో అల్లాడుతున్నారు. ఒకప్పుడు ప్రపంచానికే ‘బ్రెడ్ బాస్కెట్’గా గుర్తింపు పొందిన ఈ దేశంలో ఇప్పుడు ఇలాంటి ఆకలి ఆర్తనాదాలు వినిపిస్తుండడం హృదయాలను కలచివేస్తోంది.
ఫాస్పరస్ బాంబులను వాడలేదు : క్రెమ్లిన్
ఉక్రెయిన్‌పై దాడుల్లో భాగంగా రష్యా ఫాస్పరస్ బాంబులను వినియోగించిందన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపణలను క్రెమ్లిన్ ఖండించింది. రష్యా ఎప్పుడూ అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించలేదని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పష్టం చేశారు. పౌరప్రాంతాల్లో వైట్ ఫాస్పరస్ బాంబుల వినియోగాన్ని అంతర్జాతీయ చట్టాలు నిషేధిస్తున్నాయి.
చెర్నిహివ్‌ను పూర్తిగా చుట్టుముట్టిన రష్యా
ఉత్తర ఉక్రెయిన్‌లోని చెర్నిహివ్‌ను చుట్టుముట్టిన రష్యా బలగాలు తాజాగా ఈ నగరానికి ఇతర ప్రాంతాలతో సంబంధాలు పూర్తిగా తెంచేసినట్లు ప్రాంతీయ గవర్నర్ వియాచెస్లావ్ చౌస్ తెలిపారు. నగరంలో యుద్ధ విమానాల దాడులు, ఫిరంగి దాడులుజరుగుతున్నాయని ఆయన జాతీయ టెలివిజన్‌లో చెప్పారు.
ఇదిలా ఉండగా రష్యా సైనిక చర్య మొదలైనప్పటి నుంచి 22 లక్షలకు పైగా ప్రజలు ఉక్రెయిన్‌నుంచి పోలాండ్‌లోకి ప్రవేశించారని పోలాండ్ బార్డర్ గార్డ్ తాజాగా వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News