Friday, December 27, 2024

రామాలయ ప్రతిష్ఠకు చత్తీస్‌గఢ్ నుంచి 300 టన్నుల “సుగంధ” బియ్యం

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్ : జనవరి 22న అయోధ్యలో జరగనున్న రామాలయ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఛత్తీస్‌గఢ్ నుంచి 300 టన్నుల సుగంధ రకం బియ్యం శనివారం సరఫరా అయింది. ఈమేరకు విఐపి రోడ్డులో శ్రీరామ మందిరం వద్ద జరిగిన కార్యక్రమంలో 11ట్రక్కుల సుగంధ బియ్యం రవాణాను ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సుగంధిత్ చవాల్ అర్పణ సమారోహ్ అని పేరు పెట్టారు. చత్తీస్‌గఢ్ ప్రదేశ్ రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. అయోధ్యరామమందిరంలో జనవరి 22న ఈ బియాన్ని ప్రసాదంగా వినియోగిస్తారు.

ముఖ్యమంత్రి, మంత్రులు ఆలయం వద్ద ప్రార్థనలు చేశారు. ఆనాడు అయోధ్య నుంచి 14 ఏళ్ల అరణ్యవాసం సందర్భంగా శ్రీరాముడు ప్రస్తుత చత్తీస్‌గఢ్ ప్రాంతాల మీదుగా వెళ్లినట్టు పరిశోధకులు చెబుతున్నారు. రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌కు 27 కిమీ దూరంలోగల చాంద్‌ఖురి గ్రామం రాముని తల్లి కౌసల్యాదేవి జన్మస్థలంగా చెబుతున్నారు. ఈ గ్రామం లోని మాతా కౌసల్యదేవి ఆలయం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బాగా వెలుగులోకి వచ్చింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News