Thursday, December 26, 2024

సబ్జీ మండి నుంచి అయోధ్యకు 300 మంది రామ భక్తులు

- Advertisement -
- Advertisement -

సబ్జీ మండి నుంచి వందలాది రామ భక్తులు అయోధ్యకు తరలి వెళ్లారు. కట్ట నర్సింగ్ సారథ్యంలో ర్తుల శ్రీనివాస్ , గాండ్ల నిరంజన్ బాబు, మామిడి శివకుమార్‌లతో కూడిన సుమారుగా 300 మంది రామ భక్తులు బుధవారం సబ్జిమండి గంగాపరమేశ్వరి ఆలయం నుండి అయోధ్య దర్శనానికి బయలు దేరారు. అంతకు ముందు కరసేవకులు జి. శివరత్నం, స్థానిక గంగపుత్ర సంఘం అధ్యక్షులు ఎ. విజయ్ కిషోర్‌తో కలిసి రామ భక్తులు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారంతా రామ భజనలతో ఊరేగింపు గా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్బంగా కట్ట నర్సింగ్ మాట్లాడుతూ ఈ అవకాశం లభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News