Friday, November 15, 2024

రాజస్థాన్ లో 300 ఏళ్ల ప్రాచీన గుడి కూల్చివేత

- Advertisement -
- Advertisement -

 

Rajasthan Temple demolished

జైపూర్: బుల్ డోజర్  తాజాగా ఒక గుడిని కూల్చేయడం చర్చనీయాంశమైంది. రాజస్తాన్‌లోని అల్వాజ్ జిల్లా సరై మొహల్ల గ్రామంలో 300 ఏళ్ల క్రితం నాటి ఒక గుడిని బుల్డోజర్‌తో కూల్చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై సరై మొహల్ల నగర పంచాయతీ ఎక్సిక్యూటివ్ ఆఫీసర్‌, అల్వార్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్, స్థానిక ఎమ్మెల్యే రాజ్‌ఘర్‌లపై పోలీసు కేసు నమోదు అయింది. రాజస్తాన్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ పార్టీపై బిజెపి నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. గుడిని కూల్చేస్తున్న వీడియోను భారతీయ జనతా పార్టీ ఐసి సెల్ విభాగం ఇంచార్జ్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘‘కరౌలీ, జహంగిర్‌పురిలో జరిగిన దానికి కన్నీళ్లు పెట్టుకున్న వారే ఇప్పుడు హిందువుల నమ్మకాన్ని దెబ్బ తీశారు. ఇదే కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటున్న సెక్యూలరిజం’’ అని విమర్శలు గుప్పించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News