Wednesday, January 22, 2025

శ్రద్ధా వాకర్ హత్య కేసులో 3000 పేజీల ఛార్జిషీట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో 3000 పేజీల డ్రాఫ్ట్ ఛార్జిషీట్‌ను పోలీసులు సిద్ధం చేశారు. ఫోరెన్సిక్, ఎలక్ట్రానిక్ ఆధారాలు, 100 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు. వీటి ఆధారంగా తుది ఛార్జిషీట్‌కు ఓ రూపు ఇవ్వనున్నారు. అంతేకాదు ఆఫ్తాబ్ అంగీకార వాంగ్మూలం, నార్కో పరీక్షల నివేదికను కూడా దీనికి జత చేయనున్నారు. ప్రస్తుతం ఇది న్యాయ నిపుణుల సమీక్షలో ఉంది. ఈ నెలాఖరుకు దీనిని న్యాయస్థానంలో దాఖలు చేసే అవకాశాలున్నాయి. మరో వైపు ఆఫ్తాబ్ నుంచి సేకరించిన సమాచారం మేరకు పోలీసులు దక్షిణ ఢిల్లీ లోని పలు చోట్ల నుంచి ఇప్పటికే 13 మానవ ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. వాటి డీఎన్‌ఏ లు కూడా శ్రద్ధా తండ్రి డిఎన్‌ఏ తో సరిపోలాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News