Monday, December 23, 2024

ఉద్ధవ్ థాకరేకు మరో షాకిచ్చిన షిండే

- Advertisement -
- Advertisement -

3,000 Shiv Sainiks join CM Eknath Shinde's camp

ముంబై : మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వం లోని శివసేన వర్గానికి ఆదివారం గట్టి షాక్ తగిలింది. ఆ వర్గానికి చెందిన దాదాపు 3,000 మంది కార్యకర్తలు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వం లోని శివసేనలో చేరిపోయారు. వీరంతా ముంబై లోని వర్లీ ప్రాంతానికి చెందిన వారు. థాకరే వర్గం దసరా సందర్భంగా భారీ సభను నిర్వహించబోతున్న తరుణంలో ఈ షాక్ తగిలింది. శివాజీ పార్కులో దసరా ర్యాలీ నిర్వహణకు ఉద్ధవ్ నేతృత్వం లోని శివసేనకు బోంబే హైకోర్టు ఇటీవల అనుమతి ఇచ్చింది. ఈ సభ కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్న సమయంలో 3,000 మంది కార్యకర్తలు షిండే వర్గం లోకి వెళ్లిపోవడం ఉద్ధవ్‌కు గట్టి ఎదురుదెబ్బ . మరోవైపు వీరంతా ఆదిత్య థాకరే నియోజక వర్గం అయిన వర్లీకి చెందిన వారు కావడం మరింత దిగ్భ్రాంతికరం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News