30 వేల కిలోల డ్రగ్స్ దగ్ధం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అధికారులు ఒక్క రోజే 30 వేల కిలోల డ్రగ్స్‌ను తగులబెట్టారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని తిలకించారు. పంజాబ్‌లోని చండీగఢ్‌లోడ్రగ్స్ ట్రాఫికింగ్, నేషనల్ సెక్యూరిటీ అంశంపై నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదే సమయంలో అధికారులు ఢిల్లీ, చెన్నై, గౌహతి, కోల్‌కతాలలో ఒకే సమయంలో మొత్తం 30 వేల కిలోల డ్రగ్స్‌ను ధ్వంసం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ‘ ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ను ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చిన తర్వాత 75,000 కిలోల డ్రగ్స్‌ను ధ్వసం చేయాలని ప్రతిన బూనినట్లు అమిత్ షా చెప్పారు. అయితే ఇప్పటికే 82 వేల కిలోల డ్రగ్స్‌ను తగులబెట్టామని చెప్పారు. ఆగస్టు 15 నాటికి లక్ష కిలోల మార్కుకు చేరుకుంటామని ఆయన తెలిపారు. డ్రగ్స్‌ను ధ్వసం చేసే కార్యక్రమాన్ని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో గత జూన్ 1న చేపట్టింది. ఈ నెల 29 నాటికి దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో 51,217 కిలోల డ్రగ్స్‌ను తగుల బెట్టింది. తాజాగా అమిత్ షా సమక్షంలో మరో 30 వేల కిలు డ్రగ్స్‌ను ధ్వసం చేసింది. శనివారం ఢిల్లీలో 19,320 కిలోలు, చెన్నైలో 6,761 కిలోలు, కోల్‌కతాలో 3,077 కిలోల డ్రగ్స్‌ను ధ్వంసం చేశారు.