Monday, December 23, 2024

కర్ణాటక అసెంబ్లీ బరిలో 3044 మంది అభ్యర్థులు

- Advertisement -
- Advertisement -

డికె శివకుమార్ నామినేషన్ ఆమోదించిన అధికారులు

బెంగళూరు: కర్ణాటకలో మే 10న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 3,044 మందికిపైగా అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. నామినేషన్ల పరిశీలన అనంతరం మూడువేలమందికిపైగా ఎన్నికల్లో పోటీచేయనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అయితే ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. సవదట్టిఎల్లమ్మ, ఔరాద్, హవేరి (ఎస్‌సి), రాయ్‌చూర్, శివాజీనగర్ ఈ ఐదు నియోజకవర్గాల్లో నామినేషన్ల పరిశీలన ఇంకా పూర్తికాలేదని కర్ణాటకలోని ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఎన్నికల అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివకుమార్ నామినేషన్ తిరస్కరణకు గురవుతుందని అంతా భావించినా అధికారులు ఆమోదించారు.

డికె నామినేషన్ ఆమోదం పొందకముందు డికె మీడియాతో మాట్లాడుతూ బిజెపి ఐటిసెల్ తన నామినేషన్ పత్రాలను పరిశీలిస్తోందని, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగపరచి నామినేషన్ తిరస్కరించే అవకాశం ఉందని అయితే డికె నామినేషన్‌పై ఎన్నికల అధికారులు ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కాగా 3.044మంది అభ్యర్థుల్లో 219మంది బిజెపి, 218మంది కాంగ్రెస్, 207మంది జెడి (ఎస్) తరఫున నామినేషన్లు దాఖలు చేశారు. మిగిలిన నామినేషన్లు చిన్నపార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు దాఖలు చేసినట్లు సిఇఒ కార్యాలయం తెలిపింది. మొత్తం 4,989నామినేషన్లు దాఖలవగా వీటిలో కొన్ని తిరస్కరణకు గురయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఏప్రిల్ 24తో ముగియనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News