Friday, November 15, 2024

ముంబైని వణికిస్తున్న డెంగీ

- Advertisement -
- Advertisement -

305 dengue cases in Mumbai

ముంబై: కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ముంబై నగరాన్ని ఇప్పుడు డెంగీ వణికిస్తోంది. గత ఏడాది ముంబై నగరంలో 129 డెంగీ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు 12 వరji 305 మందికి డెంగీ సోకింది. సెప్టెంబర్ 1 నుంచి 12 మధ్యకాలం లోనే 85 కేసులు నమోదు అయినట్టు బృహాన్ ముంబై పురపాలక కార్పొరేషన్ (బిఎంసి) వెల్లడించింది. గత ఏడాది డెంగీతో ముగ్గురు మృతి చెందగా, ఈ ఏడాది ఒక్క మరణం సంభవించలేదని అధికారులు పేర్కొన్నారు. ఈ ఏడాది ఆగస్టులో 144 డెంగీ కేసులు రాగా, సెప్టెంబర్ 1 నుంచి 12 మధ్యకాలం లోనే 85 కేసులు నమోదైనట్టు బీఎంసి అధికారులు చెప్పారు. ఇప్పటివరకు 4.46 లక్షల ఇళ్లను తనిఖీ చేసి నగరంలో దోమలు పెరిగే 4108 కేంద్రాలను గుర్తించి నాశనం చేసినట్టు క్రిమి నియంత్రణ విభాగం అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News