- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 30,615 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ తో 514 మంది మరణించారు. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 4,27,23,558కి, మరణాలు 5,09,872కి చేరాయి. మొత్తం కరోనా బాధితుల్లో 4,18,43,446 మంది కోలుకోగా, 3,70,240 మంది చికిత్స తీసుకుంటున్నారు. గత 24 గంటల్లో 82,988 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 2.45 శాతంగా ఉందని, 173.86 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
- Advertisement -