Thursday, January 23, 2025

సిద్ధిపేటకు 30వ ర్యాంకు… ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యం: హరీష్

- Advertisement -
- Advertisement -

ప్రజల భాగస్వామ్యంతో సాధ్యం..

ప్లాస్టిక్ రహిత సిద్దిపేటగా దేశ స్థాయిలో కీర్తి ఘటించాలి..

అవార్డుకు కృషి చేసిన ప్రతిఒక్కరికి శుభాకాంక్షలు అభినందనలు..

సిద్దిపేట: సిద్దిపేట మరో సారి దేశ స్థాయ లో అవార్డు రావడం సంతోషంగా ఉందని మంత్రి హరీష్ రావు తెలిపారు. స్వచ్ఛ సర్వెేక్షన్ -2022లో కేంద్ర అవార్డుల్లో సిద్దిపేట కీర్తి మార్మోగింది. దేశంలోని 4354 పట్టణాల్లో సిద్దిపేటకు 30వ ర్యాంక్ రావడంతో హరీస్ రావు మీడియాతో మాట్లాడారు. సిద్దిపేట 10 ఏళ్ల క్రితమే స్వచ్ఛతలో మేటి అని ఎన్నో కార్యక్రమాలు అమలు పరిచి దేశ, రాష్ట్ర స్థాయిలో ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించారు. సిద్దిపేటలో దక్షిణ భారత దేశంలో నే రెండవ స్వచ్ బడి, ముడు రకాల చెత్త సేకరణ చేస్తున్న ఏకైక మున్సిపాల్టీ సిద్దిపేట అని చెప్పుకోవడం ఎంతో గర్వంగా ఉందన్నారు. సిద్దిపేట పట్టణ ప్రజల భాగస్వామ్యం తోనే ఏదైనా సాద్యం అవుతుందన్నారు. ఈ అవార్డు రావడంలో ప్రజలు చూపిన చైతన్యం గొప్పదని, మున్సిపల్ కౌన్సిల్, అధికారుల ఐక్యత చూపారని కొనియాడారు. ఈ సందర్భంగా స్వచ్ సర్వేక్షన్ భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో ప్రతి వార్డులో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసుకున్నామని, రాబోయే రోజుల్లో ప్లాస్టిక్ రహిత సిద్దిపేటగా దేశము లో తొలి మున్సిపాలిటిగా అవార్డు తెచ్చుకొని ఆదర్శంగా నిలవాలని పిలుపనిచ్చారు.

మంత్రి స్ఫూర్తి…. ప్రజల భాగస్వామ్యం..

ఈరోజు ఈ అవార్డు సిద్దిపేట పట్టణం సాధించింది అంటే మంత్రి హరీష్ రావు నిత్య పర్యవేక్షణ, స్ఫూర్తి, ప్రజల భాగస్వామ్యంతో సాధ్యమైందని మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు సంతోషం వ్యక్తం చేశారు. ఇదే చైతన్యంతో మరిన్ని అవార్డులు సాధించి ఆదర్శంగా నిలుస్తామన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. కౌన్సిల్ కు, మున్సిపల్ అధికారులకు సిబ్బందిని అభినందించారు. జాతీయ స్థాయిలో సిద్దిపేట పట్టణం నిలిచేలా కృషి చేసిన మంత్రి హరీష్ రావు, చైర్ పర్సన్ కడవేరుగు మంజుల రాజనర్సు, వైస్ చైర్మన్, కౌన్సిల్ సభ్యులకు, కో అప్షన్ సభ్యులు, అన్ని విధాలా సహకరించి స్వచ్ఛ సర్వేక్షన్ లో పాల్గొన్న పట్టణ ప్రజలకు మున్సిపల్ కమీషనర్ రవీందర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News