- Advertisement -
హైదరాబాద్: పార్ట్‌టైమ్ జాబ్ పేరుతో వల వేసి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రెండు వేల చెల్లించి రూ.31 లక్షలు పోగొట్టుకున్న సంఘటన హైదరాబాద్‌లోని అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిదిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నవ్యనగర్ కాలనీలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నివసిస్తున్నాడు. ఫిబ్రవరి 26న పార్ట్‌టైమ్ జాబ్ అంటూ లింక్ రావడంతో అతడు క్లిక్ చేశాడు. టాస్క్‌లు ఇవ్వడంతో పూర్తి చేశాడు. మరిన్నీ టాస్క్‌లు కోసం డబ్బులు డిమాండ్ చేయడంతో రెండు వేలు కట్టాడు. దీని కమిషన్ రావడంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సంబురపడ్డాడు. కమీషన్ పేరిట డబ్బులు వస్తుండడంతో రూ.31 లక్షలు ఆన్‌లైన్‌లో చెల్లించాడు. వెంటనే లింక్ నుంచి స్పందన లేకపోవడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -