Wednesday, January 1, 2025

31ఏళ్లు… 88కేసులు

- Advertisement -
- Advertisement -

పోరాట పటిమ, విధేయతకు కాంగ్రెస్ గుర్తింపు

యువనేత, ఎంఎల్‌సి బల్మూరి వెంకట్‌తో ‘మన తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ

ఎల్.వెంకటేశం గౌడ్
ఆయన పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. చేసిన పోరాటాలకు గుర్తింపు వచ్చింది. త్యాగాలే పెట్టుబడిగా భావించి కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఉన్నతమైన పదవిని అప్పగించింది. మొత్తంగా ఆయన విధేయతకు పట్టం కట్టింది. ఇన్నేళ్లుగా పార్టీని నమ్ముకున్నందుకు.. నిరంతరం సమస్యలపై పోరాటం చేసినందుకు ఆయన్ను పెద్దల సభకు ఎంపిక చేసింది. నిరుద్యోగ, యువత సమస్యలపై గత ప్రభుత్వంతో చేసిన పోరాటానికి గుర్తుగా ఆయనపై 88 కేసులు నమోదయ్యాయి. భయపడలేదు. పార్టీ అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడానికే కృషి చేశారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయినప్పటి నుంచి ఇప్పటివరకు పార్టీ ఆదేశాలను శిరసావహిస్తూ వస్తున్న ఎంఎల్‌ఎ బల్మూరి వెంకట్‌తో ‘మన తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వూ.

మనతెలంగాణ/హైదరాబాద్: ఆయన పడ్డ కష్టానికి ఫలి తం దక్కింది. ఆయన చేసిన కృషికి గుర్తింపు వచ్చిం ది. ఆ యన చేసిన త్యాగాలకు గుర్తింపుగా పార్టీ ఆయనకు ఉన్నతమైన పదవిని అప్పగించింది. మొత్తంగా ఆయన విధేయతకు కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టింది. ఇన్నేళ్లుగా పార్టీని నమ్ముకున్నందుకు నిరంతరం సమస్యలపై పోరాటం చేసినందుకు ఆయన్ను పెద్దల సభకు కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. నిరుద్యోగ, యువత సమస్యలపై గత ప్రభుత్వంతో చేసిన పోరాటానికి గుర్తుగా ఆయనపై 88 కేసులు నమోదయ్యాయి. అయినా భయపడలేదు. పార్టీ అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడానికే కృషి చేశారు. ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయినప్పటి నుంచి ఇప్పటివరకు పార్టీ ఆదేశాలను శిరసావహి స్తూ అందరి నోట్లో నాలుకలా మెలుగుతూ ముందుకు సా గుతుండడం ఆయన పనితీరుకు నిదర్శనం. ఆయనే ఎం ఎల్‌సి బల్మూరి వెంకట్. తనను నిరంతరం ప్రోత్సహించి తనకు ఈ పదవి రావడానికి దోహదం చేసిన నాయకులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
కష్టపడే వారికి పదవులు
జార్జిరెడ్డి, రాహుల్‌గాంధీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డిలను చూ సి ప్రజల కోసం ఏదైనా చేయాలన్న తపనతో రాజకీయాల్లోకి వచ్చారు. అంచెలంచెలుగా కాంగ్రెస్ పార్టీలో ఎదిగి రాష్ట్ర ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా 9 సంవత్సరాల పైచిలుకు పనిచేశారు. నిరంతరం ప్రజలకు కోసం మనం చేసే పోరాటాలు ఎప్పటికైనా ఫలితాలు ఇస్తుందన్న నమ్మకంతో ఆయన ఇన్నేళ్లు ముందుకు సాగారు. ఆయన అనుకున్నట్టుగానే రాష్ట్రంలో నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఆయనకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇక కాంగ్రెస్ పార్టీలో కష్టపడే వారికి పదవులు దక్కుతాయని ఆయనకు కట్టబెట్టిన పదవే నిదర్శనం.
మంత్రి పదవి ఆశిస్తే అత్యాశ…
తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నిరంతరం యువత, రైతులు, రాష్ట్రంలోని మిగతా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీనిస్తున్నారు. అతి చిన్న వయస్సులోనే (31 సంవత్సరాల 9 నెలల వయస్సులోనే) ఎ మ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయిన బల్మూరి వెంకట్ చివరి శ్వాసవరకు కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని పేర్కొంటున్నారు. మంత్రి పదవి ఆశిస్తే అత్యాశ అవుతుందని, తన కు వేరే పదవి ఏదీ ఇచ్చినా సమర్ధవంతంగా నిర్వహిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. ఎమ్మెల్సీ అయిన సందర్భం గా మన తెలంగాణ ప్రతినిధికి ఆయన ప్రత్యేక ఇంట ర్వూ ఇచ్చారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పడ్డ కష్టాలు, ఇన్నేళ్లుగా ఆయన చేసిన పోరాటాలు, ఆయన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, కన్నీళ్ల గురించి ఆయన మాటల్లోనే…..
మాది మధ్యతరగతి కుటుంబం…
మాది మధ్యతరగతి కుటుంబం. మా నాన్న నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడు చనిపోయారు. అమ్మ పద్మ, నాన్న మదన్‌మోహన్‌లు. నాన్న కాంట్రాక్టర్‌గా ఉండేవారు. మా అమ్మ అన్నీ తానై నన్ను పెంచింది. నాతో పాటు మా అన్నయ్య కూడా ఉన్నారు. హైదరాబాద్‌లోని చిక్కడపల్లి, నారాయణగూడలో చదువుకున్నాను. మానాన్న ఊరు చొప్పదండి దగ్గర మల్యాల గ్రామం. మా అమ్మ ఊరు పెద్దపల్లి. నేను ఎంబిబిఎస్ చదివాను.
88 పోలీసు కేసులు పెండింగ్‌లో…
నేను వృత్తిరీత్యా డాక్టర్‌ను. ప్రజలకు సేవ చేయాలన్న తపనతో వైద్య వృత్తిని వదిలిపెట్టి రాజకీయాల్లోకి వచ్చా. అం దులో భాగంగానే 2012లో రాజకీయాల్లోకి వ చ్చాను. 2015లో జరిగిన ఎన్నికల్లో 10 జిల్లాలకు ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను. 2019లో రెండోసారి 33 జిల్లాలకు ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను. ప్రస్తుతం నేషనల్ స్టూడెంట్స్ యూ నియన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడితో పాటు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభ్యుడు కూడా ఉన్నాను. అయినా ఇవన్నీ పట్టించుకోను. గత 10 సంవత్సరాల్లో చే సిన ఆందోళనలకు సంబంధించి నాపై 88 పోలీసు కే సు లు పెండింగ్‌లో ఉన్నాయి.దీంతోపాటు నాలుగు సా ర్లు జైలుకు వెళ్లాను. పలుమార్లు జరిగిన దాడిలో నాకు అనేక గాయాలయ్యాయి.నా పక్కటెముకలు విరిగిపోయాయి.
ఆందోళనకు సంబంధించిన కేసులే ఎక్కువ…
సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతా. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలకు సంబంధించినవే ఎక్కువ కేసులు నమోదయ్యాయి.నాపై వ్యక్తిగత కేసులు లేవు. కేసులు 2015 నుంచి 2023 వరకు ఉన్నాయి. వాటిని డీల్ చేసే లీగల్ టీమ్ ఉంది.
గతంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరాలని నాపై చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. అయినా నాకు కాం గ్రె స్ పార్టీపై ఉన్న నమ్మకం, ప్రేమతో నా జీవితకాలం మొ త్తం ఇందులోనే ఉంటాను. పార్టీకి వ్యతిరేకంగా నేను ఎ లాంటి కార్యకలాపాలకు పాల్పడను.గతంలో హు జూరా బాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయాను. ఈ నేపథ్యంలోనే నా సేవలు ఒక నియోజకవర్గంతోనే ఆగిపోవద్ద ని అధిష్టా నం సూచించడంతో మళ్లీ రాష్ట్రస్థాయిలో నా వి ధులు ని ర్వర్తిస్తున్నా. నాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మా నేత రాహుల్‌గాంధీ యువతకు,పార్టీకేడర్ సందేశాన్ని పంపించారు.
నేను ఈ స్థాయికి చేరడానికి కారణం మా ఆఫీస్ బేరర్‌లు…
నేను ఈ స్థాయికి చేరడానికి కారణం నేను ఒక్కడినే కా దు. ఎన్‌ఎస్‌యూఐకు చెందిన ఆఫీస్ బేరర్‌లో దాదాపు 1486 మంది నా వెనుక ఉన్నారు. ఎన్‌ఎస్‌యూఐ ఆఫీస్ బేరర్లపై కూడా 15 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎన్‌ఎస్‌యూఐ సభ్యులందరూ అర్హత కలిగిన వ్యక్తులే. వారిలో చాలా మంది ఇంజనీర్లు, న్యాయవాదులు, ఇతర నిపుణు లు ఉన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలన్నదే కాం గ్రెస్ అధినేత రాహుల్ గాంధీ,కెసి వేణుగోపాల్, సిఎం రేవంత్‌రెడ్డిల లక్ష్యం. తెలంగాణలోని ప్రతి యువత రాజకీయాల్లోకి రావాలి. వారు తమ సమస్యలపై పోరాటం చేయాలి. కొత్త తరం, కొత్త రక్తం కావాలి. రాజకీయాల్లో చదువుకున్న యువతను కాంగ్రెస్ కోరుకుంటుంది. ప్రజ ల మనోభావాలతో రాజకీయాలు చేయాలనుకునే భారతీయ జనతా పార్టీ తరహాలో మా రాజకీయాలు ఉండవు. విద్యను కార్పొరేటీకరణ చేయడాన్ని మేము ఒప్పుకోం.
బాధ్యత మరింత పెరిగింది…
ఇప్పుడు నాకు ఎంఎల్‌సి రావడంతో బాధ్యత మరింత పెరిగింది. ఇప్పుడు నేను నిర్వర్తించాల్సిన బాధ్యతలు చా లానే ఉన్నాయి. నేను చాలా నిర్మాణాత్మకంగా, వ్యవస్థీకృ త పద్ధతిలో నిర్ణయాలు తీసుకుంటున్నాను. నా ప్రయా ణం ఇప్పుడే ప్రారంభమైంది, నేను నా బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తాను. తెలంగాణ యువత కోసం మా పార్టీ చేసిన వాగ్దానాలను నెరవేర్చడానికి కృషి చేస్తాను. నాకు నచ్చిన నాయకుల్లో రాహుల్ గాంధీ అంటే చాలా ఇష్టం. సిఎం రేవంత్‌రెడ్డి సంకల్పం చూసి నాకు అలాగే ఉండాలనిపిస్తోంది. వారిద్దరి విజన్‌తోనే ప్రస్తుతం రాజకీయాల్లో మరింత రాణిస్తానన్న నమ్మకం మరింత పెరిగింది.
100 రోజుల్లో పథకాలను అమలు చేస్తాం
ప్రజా సంక్షేమం కోసం అందరం కష్టపడి పనిచేస్తాం. 100 రోజుల్లో మా సంక్షేమ పథకాలను అమలు చేయడానికి శాయశక్తులా కృషి చేస్తాం. గత ప్రభుత్వం చేసిన అప్పులను, తప్పులను ఎత్తిచూపుతూనే మా పథకాలను అమలు చేస్తాం. ఒకవేళ వాటిని అమల్లో చేయడంలో తేడా వస్తే ఎందుకు, అలా చేయాల్సి వచ్చింది, దానికి కారణాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తాం.
ఈ సంవత్సరంలోపు ఖాళీలను భర్తీ చేస్తాం
రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. యువతకు ప్రభుత్వ రంగంలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మా మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పాం. ఈ ఖాళీలను భర్తీ చేయడమే మా ప్రాధాన్యత. ఇప్పటికే టిఎస్‌పిఎస్పీ ప్రక్షాళన కూడా పూర్తయ్యింది. ఈ సంవత్సరం పూ ర్తయ్యేలోపు ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపడుతోం ది. దీంతోపాటు యువత నైపుణ్యాభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇతర దేశాల్లో ఉద్యోగాలు పొందడానికి లేదా వారి సొంతంగా (ఎంట్రప్రెన్యూర్షిప్) సంస్థలను ప్రారంభించడంలో సాయం చేస్తాం. 18 నుంచి 40 సం వత్సరాల వయస్సు ఉన్న వారి లక్ష్యాలను నెరవేర్చేలా ప్ర ధానంగా దృష్టి పెడుతున్నాం. యువతకు ఉపాధి లభించే అన్ని మార్గాలను కూడా అన్వేషిస్తున్నాం. పలు జిల్లాల్లో పరిశ్రమలు, సంస్థలు ఏర్పాటయ్యేలా సిఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో మొ త్తం నిరుద్యో గ యువత సంఖ్య 45 లక్షలకు చేరుకుంది. ప్రభుత్వ ఉ ద్యోగాలు కాకుండా, యువతకు ఉపాధి అవకాశాలను క ల్పించడానికి ఏ ఇతర మార్గాలను ప్రభుత్వం పరిశీలిస్తోం ది. యువతకు ఉపాధి కల్పించే చిన్న తరహా పరిశ్రమలు, చిన్న వ్యాపార సంస్థలు, స్థానిక సంస్థలపై, తయారీ పరిశ్రమలపై దృష్టి పెట్టాం. యువతకు ఉద్యోగాలు రావాలంటే నైపుణ్యాభివృద్ధి కూడా అవసరమని గుర్తించాం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News