Monday, December 23, 2024

ఒడిశా రథ జాతరకు 315 ప్రత్యేక రైళ్లు

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: ఒడిశాలో జులై 6 నుంచి 19 వరకు 315 స్పెషల్ ట్రెయిన్స్ నడుపనున్నారు. పూరీ నుంచి ఈ ప్రత్యేక రైళ్లు నడుపనున్నారు. వీటిని రథ జాతర కోసం నడుపనున్నారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ విషయాన్ని ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంఝీ, ఆయన డిప్యూటీలైన కనక్ వర్ధన్ సింగ్ దేవ్, ప్రవతి పరింద లకు శుక్రవారం న్యూఢిల్లీలో సమావేశం సందర్భంగా తెలిపారు.

పర్వదినం వేళ 15 వేల మంది భక్తుల కోసం వసతి కూడా కల్పించనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే నడిపే ఈ ప్రత్యేక రైళ్లు బాదంపహాడ్, రూర్కేలా, బలేశ్వర్, సోనెపూర్, దాస్ పల్లా, జగన్నాథ్ రోడ్, సంబల్ పూర్, కేందుఝర్ గఢ్, పారాదీప్, భద్రక్, అంగుల్, గునుపుర్, బంగిడిపోసి వంటి వివిధ స్టేషన్లలో ఆగుతాయి. గుండిచా జాతర, సంధ్యా దర్శనం, బహుదా జాతర, సునావేష, రథ జాతర అధర్పణ వంటి ఆచార కార్యక్రమాలకు ఈ ప్రత్యేక రైళ్లు నడుపనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News