Wednesday, January 22, 2025

మంత్రి దామోదర రాజనర్సింహను కలిసిన 317 జివో బాధితులు

- Advertisement -
- Advertisement -

అండగా ఉంటామని భరోసా ఇచ్చిన మంత్రి

మన తెలంగాణ / హైదరాబాద్: గత ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవో ద్వారా ఇబ్బందులు ఎదుర్కుంటున్న బాధితులు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహను ఆదివారం హైదరాబాదులోని ఆయన నివాసానికి వెళ్లిన 317 జీవో బాధితులు తమ సమస్యలను పరిష్కరించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా 317 జీవో బాధితులు మంత్రి దామోదర్ రాజనర్సింహకి తమ సమస్యల పరిష్కారం కోసం ఓ వినతి పత్రాన్ని సమర్పించారు. గత ప్రభుత్వం అసంబద్ధ నిర్ణయాలతో ఉద్యోగుల స్థానికతను గుర్తించకుండా, జోనల్ వ్యవస్థను తీసుకొచ్చి తమ జీవితాలతో చెలగాటం అడుకున్నారని మంత్రికి వివరించారు.

గత ప్రభుత్వ నిరంకుశ పాలన, అస్తవ్యస్త విధానాలతో ఉద్యోగులను, కుటుంబాలను అనేక ఇబ్బందులకు గురిచేశారని మంత్రి రాజనర్సింహకి బాధితులు వెల్లడించారు.తమ స్థానికత, పదోన్నతులు, బదిలీలు, స్పౌజ్ కేసుల సమస్యల పరిష్కారానికి క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకోవాలని కోరారు. బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలపై లోతుగా చర్చిస్తామని మంత్రి దామోదర్ రాజనర్సింహ సానుకూలంగా స్పందించారు.క్యాబినెట్ సబ్ కమిటీ లో అధ్యయనం చేసి న్యాయం చేస్తామన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలను కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వం లో పునర్ సమీక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు, అన్ని వర్గాల వారికి అండగా నిలుస్తుందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News