Friday, November 22, 2024

వ్యాక్సినేషన్‌లో మహారాష్ట్ర ముందంజ

- Advertisement -
- Advertisement -

ఒక్కరోజే 32.53 లక్షల మందికి కొవిడ్ వ్యాక్సినేషన్
వ్యాక్సినేషన్‌లో మహారాష్ట్ర ముందంజ

న్యూఢిల్లీ: కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టిన తర్వాత దేశవ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే అత్యధికంగా 32.53 లక్షల మందికి పైగా కరోనా వ్యాక్సినేషన్ జరిగింది. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 4.8 కోట్ల మందికి పైగా వ్యాక్సినేషన్ జరిగినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం తెలిపింది. వ్యాకినేషన్ చేపట్టిన 66వ రోజున(మార్చి 22) 32,53,095 మందికి వ్యాక్సిన్ వేసినట్లు ఆరోగ్య శాఖ వివరించింది. వీరిలో 29,03,030 మంది లబ్ధిదారులు మొదటి డోసు వేసుకోగా 3,50,065 మంది ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్స్ రెండవ డోసు వ్యాక్సిన్ వేసుకున్నారు. 29,,03,030 మంది లబ్ధిదారులలో 60 ఏళ్లు పైబడిన వారు 21,31,012 మంది, వివిధ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న 45-60 మధ్య వయస్కులు 5,59,930 మంది ఉన్నారు. ఇప్పటివరకు మహారాష్ట్రలో అత్యధికంగా 45,54,836 మంది వ్యాక్సిన్ వేయించుకోగా తర్వాతి స్థానాలలో వరుసగా రాజస్థాన్ (45,41,540), ఉత్తర్ ప్రదేశ్(45,33,871), గుజరాత్(39,50,792), పశ్చిమ బెంగాల్(39,41,280) ఉన్నాయి.

32.53 lakh covid doses administered on March 22

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News