Friday, December 27, 2024

32కిలోల గంజాయి స్వాధీనం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గంజాయి తరలిస్తున్న ఓ యువకుడి నుంచి మాదాపూర్ ఎస్‌ఓటి పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. గంజాయి రవాణా చేస్తున్న యువకుడిని అరెస్టు చేసి అతడి వద్ద నుంచి 32కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…సంగారెడ్డి జిల్లా, నాగల్‌గిద్ద మండలం, ఇరక్‌పల్లికి చెందిన బానోత్ లక్ష్మణ్ పటాన్ చెరువులో ఉంటు మేస్త్రీ పనిచేస్తున్నాడు.

సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసి నిందితుడు గంజాయి రవాణా చేస్తున్నాడు. ఈ విషయం తెలియడంతో కొల్లూరు టోల్‌గేట్ వద్ద ఉన్న ఓఆర్‌ఆర్ వద్ద నిందితుడిని మాదాపూర్ ఎస్‌ఓటి పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 32 కిలోల రూ.10,50,000 విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు కోసం కొల్లూరు పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News