Sunday, January 19, 2025

భగ్గుమన్న బంగ్లా

- Advertisement -
- Advertisement -

ఢాకా : బంగ్లాదేశ్ మరోసారి నిరసనలతో భగ్గుమంటోంది. ఆదివారం నిరసన కారులకు, అ ధికార అవామీలీగ్ మద్దతుదారులకు మధ్య హింసాత్మక సంఘర్షణలు చెలరేగి 93 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాదిమంది తీ వ్రంగా గాయపడ్డారు. మొన్నటివరకు రిజర్వేష న్ కోటాకు వ్యతిరేకంగా సాగిన ఆందోళనలు ఇప్పుడు ప్రభుత్వమే రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో మళ్లీ ఆందోళన తీవ్రం చే శారు. ఆదివారం ఉదయం ప్రధాని షేక్‌హసీ నా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వి ద్యార్థులు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో అధికార పార్టీ అవామీలీగ్‌తోపాటు , అవామీలీగ్ మద్దతుదారులైన ఛాత్రాలీగ్,

జుబోలీగ్ కార్యకర్తలు పాల్గొని దీన్ని వ్యతిరేకించడంతో పరిస్థితి హింసాత్మక ఘర్షణకు దారితీసింది. ఆదివారం బంగ్లాదేశ్ లోని 12 జిల్లాల్లో హింసాత్మక సంఘర్షణలు చెలరేగాయి. ఫెనిలో ఐదుగురు, సిరాజ్‌గంజ్‌లో ఓ పోలీస్‌స్టేషన్‌పై ఆందోళనకారులు జరిపిన దాడిలో 13మంది సిబ్బంది మృతి చెందారు. మున్సిగంజ్‌లో ముగ్గురు, బొగురలో ముగ్గురు, మగురలో ముగ్గురు, భోలాలో ముగ్గురు, రంగ్‌పూర్‌లో ముగ్గురు, పబ్నాలో ఇద్దరు, సిల్హెట్‌లో ఇద్దరు, కొమిల్లాలో ఒకరు, జోయ్‌పుర్హత్‌లో ఒకరు, ఢాకాలో ఒకరు, బరిసాల్‌లో ఒకరు చనిపోయారు. దీనిపై బంగ్లాదేశ్ హోం మంత్రిత్వశాఖ ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి నిరవధిక కర్ఫూ విధించడానికి నిర్ణయించింది.

మెటాప్లాట్‌ఫారంలు, ఫేస్‌బుక్, మెసెంజర్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, తదితర సామాజిక మాధ్యమాలను మూసివేయాలని ప్రభుత్వ సంస్థ ఆదేశించింది. 4 జి మొబైల్ ఇంటర్నెట్‌ను మూసివేయాలని మొబైల్ ఆపరేటర్లను ఆదేశించారు. విద్యార్థులు కేవలం ప్రధాని హసీనా రాజీనామాయే తమ ప్రధాన డిమాండ్‌గా ఆందోళన సాగిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బంగ్లాదేశ్ మొత్తం మీద నిరసన ముసుగులో ఎవరైతే ఆందోళన చేపట్టారో వారు అసలైన విద్యార్థులు కారని, ఉగ్రవాదులని, అటువంటివారిని గట్టిగా అణచివేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దేశంలో శాంతిభద్రతలపై గణభాబన్ వద్ద నేషనల్ కమిటీతో సమావేశం నిర్వహించారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, పోలీస్, ఆర్‌ఎబి, బిజిబి చీఫ్‌లతో మళ్లీ దేశంలో హింసాత్మక సంఘటనలు తలెత్తడంపై చర్చించారు. ఈ నిరసనల కారణంగా ఢాకాలో షాపులు, మాల్స్ మూతపడ్డాయి. విద్యార్థులు, ఉద్యోగులు, ఢాకా లోని షాబాగ్‌లో సమావేశమై ట్రాఫిక్‌ను అడ్డుకున్నారు.యాంటీ డిస్క్రిమినేషన్ స్టూడెంట్స్ మూవ్‌మెంట్ అన్న బ్యానర్‌పై ఆందోళన సాగిస్తున్న నిరసనకారులు తమ నినాదాలను ప్రధాని హసీనా రాజీనామాకు డిమాండ్‌గా మార్చుకున్నారు.

రిజర్వేషన్‌కోటాకు వ్యతిరేకంగా ఇటీవల సాగిన నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేశారు. ఢాకా లోని సైన్స్ లాబ్ వద్ద నిరసనకారులు గుమికూడి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. కొంతమంది కర్రలు పట్టుకుని ఆస్పత్రి ఆవరణలో ప్రైవేట్ కార్లు, అంబులెన్సులు, మోటారు సైకిళ్లు, బస్సులపై దాడులు చేయడం ఆస్పత్రి లోని రోగులను కలవరం కలిగించింది. నిరసనకారులను శాంతపర్చడానికి, హింసను నివారించడానికి ప్రధాని హసీనా ఆహ్వానించినా విద్యార్థులు తిరస్కరించారు. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్శిటీలు, ప్రైవేట్ యూనివర్శిటీలు, మదర్సాలు, బహిష్కరించాలని విద్యార్థులకు నిరసనకారులు పిలుపునిచ్చారు. కార్మికులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు, ఇతర ప్రజా ప్రతినిధులు ఈ ఆందోళనలో పాలు పంచుకోవాలని కోరారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల కో ఆర్డినేటర్ నహీద్ ఇస్లాం, ప్రభుత్వం రాజీనామాయే ప్రథాన డిమాండ్‌గా సోమవారం సామూహిక ధర్నా నిర్వహిస్తామని ప్రకటించారు. నిరసనలకు బంగ్లాదేశ్ కీలక నాయకుల్లో ఒకరైన ఆసిఫ్ మహమూద్ పోరాటానికి సిద్ధంగా ఉండాలని తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. కొంతమంది మాజీ సైనికాధికారులు కూడా విద్యార్థి ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు.

భారత్ అప్రమత్తం…
దీంతో భారత్ అప్రమత్తమైంది. ఆ దేశంలో ఉంటున్న భారతీయుల్ని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అత్యవసర పరిస్థితుల్లో -+8801313076402 నంబర్‌కి సంప్రదించాలని బంగ్లాదేశ్ లోని భారత రాయబార కార్యాలయం కోరింది. కొద్ది రోజుల క్రితం ప్రారంభమైన హింసాత్మక నిరసనల్లో 200 మందికి పైగా మరణించారు. ఇటీవల రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా బంగ్లా దేశ్ వ్యాప్తంగా విద్యార్థులు, ప్రజలు భారీ ఎత్తున నిరసన చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో బంగ్లా స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఆందోళన చేయడం హింసాత్మకంగా మారింది. అయితే అక్కడి సుప్రీం కోర్టు ఈ నిర్ణయంపై స్టే విధించడంతో ఆందోళనలు తగ్గాయి. అయితే నిరసనలను పోలీస్‌లతో ఘోరంగా అణచివేయడంపై మరోసారి ఆ దేశంలో ఆందోళనలు చెలరేగడం ప్రారంభమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News