జెరూసలెం: ఇజ్రాయెల్ లో గత కొన్నివారాలుగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. జెరూసలెం ఘర్షణలు యుద్ధరూపు సంతరించుకుంటున్నాయి. జెరూసలెంలోని మసీదు వద్ద ఇజ్రాయెల్, పాలస్తీనియన్ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. మసీదు నుంచి బలగాలు ఉపసంహరించుకోవాలని హమాస్ ఉగ్రవాదులు హెచ్చరిస్తున్నారు. బలగాలు వెనక్కి తగ్గకపోవడంతో హమాస్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు. గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ హింసాత్మక ఘటనలో 32 మంది పాలస్తీనియన్లు మృతిచెందారు. పలువురికి గాయాలయ్యాయి. మృతుల్లో 16 మందిని హమాస్ ఉగ్రవాదులుగా ఇజ్రాయెల్ గుర్తించింది. హమాస్ ఉగ్రవాదులు గాజా నుంచి 500 రాకెట్లు ప్రయోగించారు. హమాస్ రాకెట్ దాడుల్లో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఇజ్రాయెల్ మృతుల్లో ఒకరు కేరళకు చెందిన మహిల ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. హమాస్ ముష్కరులపై దాడులు తీవ్రం చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యూహు వెల్లడించారు.