Tuesday, November 5, 2024

బ్లాక్ ఫంగస్‌తో ఒకే ఆస్పత్రిలో 20 రోజుల్లో 32మంది మృతి

- Advertisement -
- Advertisement -

32 people died in 20 days in Indore Hospital with Black Fungus

ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 20 రోజుల వ్యవధిలో 32మంది బ్లాక్ ఫంగస్‌తో మరణించారని ఓ వైద్య అధికారి వెల్లడించారు. మహరాజ యశ్వంతరావు ప్రభుత్వ హాస్పిటల్‌లో ఈ మరణాలు సంభవించాయి. మృతుల్లో అధికభాగం కొవిడ్ నుంచి కోలుకున్నవారే కావడం గమనార్హం. అయితే, ఆ రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి బ్లాక్ ఫంగస్‌తో బాధపడ్తూ ఈ హాస్పిటల్‌లో చేరారని అధికారులు పేర్కొన్నారు. ఈ హాస్పిటల్‌లో బ్లాక్ ఫంగస్ మొదటి కేసు మే 13న నమోదైంది. మొత్తం 439మంది బ్లాక్ ఫంగస్‌తో చేరగా, 84మంది కోలుకొని ఇంటికి వెళ్లారని, 32మంది మరణించారని హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రేమేంద్ర ఠాకూర్ తెలిపారు. ఈ హాస్పిటల్‌లో బ్లాక్ ఫంగస్ మరణాల రేట్ 7.29 శాతంగా నమోదైంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News