- Advertisement -
హైదరాబాద్: ప్రతి జిల్లాలో వైద్య కళాశాల ఉండాలని సిఎం కెసిఆర్ ఆదేశించారని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. మూడో రోజు శాసన సభ కొనసాగుతున్న సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. 33 జిల్లాల్లోనూ వైద్య కళాశాలలు ఉండేలా చర్యలు తీసుకుంటామని, 17 వైద్య కళాశాలలు ఈ ఏడాది నుంచే పని చేస్తామని వివరించారు. వచ్చే ఏడాది నుంచి మరో తొమ్మిది వైద్య కళాశాలలు పని చేస్తాయని తెలిపారు. దసరాలోగా వెయ్యి మంది కొత్త వైద్యుల నియామకం ఉంటుందని, ఈ సారి 800 మంది ఎస్‌ఆర్‌లను జిల్లాల్లోనే నియమించామని తెలిపారు. తెలంగాణలో ఇప్పటి వరకు 103 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు.
- Advertisement -