Wednesday, January 22, 2025

ఛత్తీస్‌గఢ్‌లో 33 మంది నక్సలైట్లు లొంగుబాటు

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్‌గఢ్ బిజాపూర్ జిల్లాలో 33 మంది నక్సలైట్లు శనివారం భద్రత దళాల ముందు లొంగిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. వారిలో ముగ్గురిపై రూ. 3 లక్షల నగదు బహుమతి ప్రకటన ఉందని పోలీసులు తెలిపారు. గిరిజనులపై మావోయిస్టులు సాగిస్తున్న అత్యాచారాలతోను, ‘బూటకపు’ మావోయిస్టు సిద్ధాంతంపైన నిరాశ చెందిన పోలీసులు, సిఆర్‌పిఎఫ్ సీనియర్ అధికారుల ముందు నక్సలైట్లు లొంగిపోయినట్లు బిజాపూర్ సీనియర్ ఎస్‌పి జితేంద్ర యాదవ్ తెలియజేశారు.

పోలీసులు పునరావాస విధానం పట్ల కూడా వారు ఆకర్షితులయ్యారని ఆయన తెలిపారు. లొంగిపోయిన 33 మంది నక్సటైట్లలో ఇద్దరు మహిళలు మావోయిస్టుల గంగలూర్ ఏరియా కమిటీ కింద వివిధ విభాగాలు, సంస్థల్లో క్రియాశీలకంగా ఉన్నారని ఆయన తెలిపారు. లొంగిపోయిన నక్సలైట్లకు ఒక్కొక్కరికీ రూ. 25 వేలు అందజేసినట్లు, ప్రభుత్వ విధానం ప్రకారం వారికి పునరావాసం కల్పించనున్నట్లు పోలీసులు తెలియజేశారు. దీనితో ఈ ఏడాది బిజాపూర్ జిల్లాలో ఇంత వరకు 109 మంది నక్సలైట్లు హింసాకాండకు స్వస్తి పలికారని, 189 మందిని అరెస్టు చేశారని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News