Tuesday, December 24, 2024

చత్తీస్‌గఢ్‌లో 33 మంది నక్సల్స్ లొంగుబాటు

- Advertisement -
- Advertisement -

సుక్మా(ఛత్తీస్‌గఢ్ ): చత్తీస్‌గఢ్ లోని సుక్మా జిల్లాలో 33 మంది నక్సల్స్ పోలీసుల ముందు లొంగిపోయారు. వీరిలో ముగ్గురిపై రూ. లక్ష వంతున రివార్డు ప్రకటించి ఉంది. దబ్బమార్క క్యాంప్ వద్ద మంగళవారం జన్ దర్శన్ కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా నక్సల్స్ తమంత తాము లొంగిపోయారని సుక్మా పోలీస్ సూపరింటెండెంట్ సునీల్ శర్మ చెప్పారు.

లొంగిపోయిన వారిలో దండకారణ్య ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సంఘటన్ అధ్యక్షుడు డీర్డో ముడా, చేతన నాట్య మండలి (నక్సల్స్ సాంస్కృతిక విభాగం ) అధ్యక్షుడు హిడ్మా, మిలీషియా కమాండర్ వజం హిడ్మాలపై రూ. లక్ష వంతున పోలీస్‌లు ఇదివరకు ప్రకటించడమైంది. నక్సల్ శుష్క సిద్దాంతానికి విసిగి తాము ఆయుధాలను విడిచిపెట్టి లొంగిపోయామని వారు వివరించారని సునీల్ శర్మ పేర్కొన్నారు. సుక్మా జిల్లా కిస్టారం ఏరియాలో గతంలో ఈ నక్సల్స్ అనేక అరాచక కార్యకలాపాల్లో పాల్గొన్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News