Monday, December 23, 2024

గుజరాత్ తీరంలో 3వేల కిలోల డ్రగ్స్ స్వాధీనం..

- Advertisement -
- Advertisement -

గాంధీనగర్: అరేబియా సముద్రంలో భారీ అంతర్జాతీయ స్మగ్లింగ్ రాకెట్‌ను భారత నౌకాదళం ఛేదించింది. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరోతో జరిపిన సంయుక్త ఆపరేషన్‌లో భాగంగా 3300 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. గుజరాత్ లోని పోర్‌బందర్ తీరంలో నౌక నుంచి వాటిని సీజ్ చేసింది.

మంగళవారం అనుమానాస్పదంగా భారత జలాల్లోకి ప్రవేశించిన చిన్నపాటి నౌకను గుర్తించిన అధికారులు వెంటనే దానిని ముట్టడించి, 3089 కిలోల చరాస్, 158 కిలోల మెథామెఫ్తమైన్, 25 కిలోల మార్ఫిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. వీరంతా పాకిస్థానీయులే. కొద్ది రోజుల క్రితం దాదాపు రూ.2500 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర, ఢిల్లీలో భారీ ఎత్తున మ్యావ్ మ్యావ్ (మె ఫ్రెడిన్) అనే మాదక ద్రవ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News