Monday, January 20, 2025

19 వేలు దాటిన క్రియాశీల కేసులు

- Advertisement -
- Advertisement -

3324 new covid cases reported in india

న్యూఢిల్లీ : దేశంలో గత కొద్ది రోజులుగా స్వల్ప, హెచ్చుతగ్గులతో కొత్త కేసులు 3 వేలకు పైగానే నమోదవుతున్నాయి. అయితే అంతకు ముందు రోజుతో పోల్చితే కొత్త కేసులు స్వల్పంగా తగ్గాయి. మరోవైపు క్రియాశీల కేసులు క్రమంగా పెరుగుతూ 19 వేలకు చేరుకున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 4,71,087 నిర్ధారణ పరీక్షలు చేయగా, కొత్తగా 3,324 కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజు ఈ సంఖ్య 3,688 గా ఉంది. గత 24 గంటల్లో కరోనాతో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే అందులో 36 మరణాలు కేరళ నుంచే నమోదయ్యాయి. ఇక ఇప్పటివరకు దేశంలో మొత్తం మృతుల సంఖ్య 5,23,843 కు చేరుకుంది. తాజాగా 2,876 మంది కోలుకోగా, ఇప్పటివరకు వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4.25 కోట్లు దాటింది. ఆ రేటు 98.74 శాతంగా కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలు తక్కువగా నమోదవుతుండటంతో క్రియాశీల కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో 19,092 యాక్టివ్ కేసులు (0.04 శాతం) ఉన్నాయి. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ నిరంతరాయంగా కొనసాగుతోంది. శనివారం 25,95,267 మంది టీకాలు తీసుకోగా, ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 189.17 కోట్లు దాటింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News