హైదరాబాద్: తెలంగాణలో 34 ఐపీఎస్ పోస్టుల ఖాళీలు ఉన్నాయని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మంగళవారం లోక్ సభలో వెల్లడించింది. టిఆర్ఎస్ ఎంపీలు రంజిత్ రెడ్డి, వెంకటేష్ నేత, మాలోత్ కవిత, పసునూరి దయాకర్ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సమాధానం ఇచ్చారు. రాష్ట్ర పోలీస్ సర్వీస్ నుంచి ఐపీఎస్ ల నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు సమిష్టిగా కృషి చేస్తున్నామన్నారు. గడచిన ఐదేండ్లలో రాష్ట్ర పోలీస్ సర్వీస్ నుంచి ప్రమోషన్ ల కింద 20మంది ఐపీఎస్ అధికారులను నియమించామని తెలిపారు. 2020 ఏడాదిలో సివిల్ సర్వీస్ పరీక్ష నుంచి ఐదుగురిని తెలంగాణ క్యాడర్ కు కేటాయించామని చెప్పారు. సివిల్ సర్వీస్ పరీక్ష ద్వారా ఎంపికయ్యే ఐపీఎస్ అధికారుల సంఖ్యను 150 నుంచి 200కు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
34 IPS Posts Vacant in Telangana: Central Home Ministry