Thursday, January 23, 2025

ట్రక్కు-బస్సు ఢీ: ఇద్దరు మృతి… 34 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

34 Members injured in Road Accident in TN

చెన్నై: తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు జిల్లా పొలాచి గ్రామ శివారులో బుధవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు-బస్సు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందగా 34 మంది గాయపడ్డారు. క్షతగాత్రులలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు నటరాజ్(55), కిట్టుస్వామి(50)గా గుర్తించారు. బస్సు 34 మంది ప్రయాణికులతో గోపాలపురం నుంచి పొలాచి వెళ్తుండగా.. ట్రక్కు పొలాచి నుంచి నల్లిగౌండిపాలయమ్ వెళ్తుండగా పొలాచి-పళక్కాడ్ జాతీయ రహదారిపై జరిగింది. ట్రక్కును బస్సు ఓవర్ టేక్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా రోడ్డుపై ఉన్న వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News