Monday, December 23, 2024

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 34 ఎంఎంటిఎస్ రైళ్లు రద్దు

- Advertisement -
- Advertisement -

34 MMTS trains canceled due to South Central Railway

 

మనతెలంగాణ/హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 34 ఎంఎంటిఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ టు లింగంపల్లి మధ్య నడిచే 18 సర్వీసులను, ఫలక్‌నుమా టు లింగంపల్లి మధ్య నడిచే 14 సర్వీసులతో పాటు సికింద్రాబాద్ టు లింగంపల్లి మధ్య నడిచే 2 ఎంఎంటిఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని, ప్రత్యామ్నాయ సర్వీసులను ఎంచుకోవాలని దక్షిణమధ్య రైల్వే అధికారులు సూచించారు. ఆదివారం ఒక్కరోజే 34 ఎంఎంటిఎస్ రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది.

రద్దు అయిన రైళ్ల వివరాలు ఇలా….

లింగంపల్లి టు హైదరాబాద్ మధ్య రద్దు అయిన రైళ్ల నంబర్లు ఇలా… 47129, 47132, 47133, 47135, 47136, 47137, 47138, 47139, 47140.
హైదరాబాద్ టు లింగంపల్లి మధ్య రద్దు అయిన రైళ్ల నెంబర్లు ఇలా… 47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120.
ఫలక్‌నుమా టు లింగంపల్లి మధ్య రద్దు అయిన రైళ్ల వివరాలు ఇలా.. 47153, 47164, 47165, 47166, 47203, 47220, 47170

లింగంపల్లి టు ఫలక్‌నుమా మధ్య రద్దు అయిన రైళ్లు….

47176, 47189, 47210, 47187, 47190, 47191, 47192

సికింద్రాబాద్ టు లింగంపల్లి మధ్య రద్దు అయిన రైలు వివరాలు..

47150

లింగంపల్లి టు సికింద్రాబాద్ మార్గంలో 47195 నెంబర్ గల ఎంఎంటిఎస్ రైళ్లను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News