మన తెలంగాణ/హైదరాబాద్ /ఉమ్మడి కరీంనగర్ జిల్లా బ్యూరో : రాష్ట్రంలో రెం డు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ ఎం ఎల్‌సి స్థానాల ఎన్నికలకు నామినేషన్ల పరిశీలన మంగళవారం పూర్తయింది. మెదక్ -నిజామాబాద్ -ఆదిలాబాద్- కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల ఎంఎల్‌సి స్థా నానికి 68 నామినేషన్లు ఆమోదం పొం దగా, 32 నామినేషన్లు తిరస్కరణకు గు రయ్యాయి. అలాగే మెదక్- నిజామాబా ద్- ఆదిలాబాద్ -కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి 16 నామినేషన్లు ఆ మోదం పొందగా, ఒక నామినేషన్ తిరస్కరణ గురయ్యిందని రిటర్నింగ్ అధికా రి పమేలా సత్పతి వెల్లడించారు. అలాగే వరంగల్ -ఖమ్మం -నల్లగొండ ఉపాధ్యా య ఎంఎల్‌సి స్థానానికి 22 నామినేష న్లు ఆమోదం పొందగా, ఒక నామినేష న్ తిరస్కరణకు గురయ్యింది. ఈ మూ డు ఎంఎల్‌సి స్థానాలకు ఈ నెల 3న నా మినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా, సోమవారం
(ఫిబ్రవరి 10)తో నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. అయితే మంగళవారం(ఫిబ్రవరి 11) నామినేషన్ల పరిశీలన చేపట్టారు. నామినేషన్ల ఉపసంహరణకు 13వ తేదీ వరకు గడువు ఉంది. ఈనెల 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు.
నిబంధనల ప్రకారం పరిశీలన ప్రక్రియ: ఎన్నికల రిటర్నింగ్ అధికారి
ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. అభ్యర్థులు నామినేషన్ల సమర్పించిన సందర్భంలో ఏవైనా లోపాలు ఉంటే గుర్తించి అభ్యర్థులకు షార్ట్ మెమోలు ఇచ్చి సరిచేసుకునేందుకు అవకాశం కల్పించామని అన్నారు. కొంతమంది ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. నియమ నిబంధనలను అనుసరించి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ జరిగిందని తెలిపారు. సరైన ఫార్మాట్లో సమర్పించని నామినేషన్లను తిరస్కరించినట్లు తెలిపారు. అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసం నామినేషన్ తీసుకునే తేదీల్లో హెల్ప్ డెస్క్‌ను కూడా ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. నామినేషన్ల పరిశీలన ప్రక్రియ అనంతరం అభ్యర్థుల నుండి అభ్యంతరాలు కోరారు. తిరస్కరణపై అభ్యంతరం వ్యక్తం చేసిన వారి సందేహాలను నివృత్తి చేశారు. తిరస్కరణకు గల కారణాలను వివరంగా అభ్యర్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి పరిశీలకులు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సంజయ్ రామన్, అడిషనల్ కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, డిఆర్‌ఓ వెంకశ్వర్లు, ఆర్‌డిఒలు మహేశ్వర్, రమేష్, ఎఒ నరేందర్, తహసిల్దార్లు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.