Sunday, November 17, 2024

అసెంబ్లీ ఎన్నికల బరిలో నారీమణులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాజకీయ సమరాంగణంలో నారీభేరి మొగింది. తెలంగాణ శాసనసభ ఎన్నికల పోటీకి ప్రధాన రాజకీయ పార్టీల నుంచి ఈ సారి మొత్తం 34 మంది కొంగు బిగించారు. పురుషులకు ధీటుగా రాజకీయ వ్యూహాలకు పదును పెడుతూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. పార్టీలు కూడా ఈ సారి ఆషామాషీగా కాకుండా మహిళారంగం నుంచి అన్నివిధాలుగా ధీటైన అభ్యర్ధులనే ఎంపిక చేసి బరిలోకి దించారు.అందులో అధికార భారత రాష్ట్ర సమితీ పార్టీ నుంచి 8మంది మహిళలు పోటీలో ఉండగా, ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్‌పార్టీ నుంచి 11మంది ,

భారతీయ జనతాపార్టీ నుంచి 15మంది మహిళా అభ్యర్దులు పోటీలో ఉన్నారు. తెలంగాణ శాసనసభలో 2018-2023 కాలానికి సంబంధించి ప్రాతినిధ్యం వహించిన మహిళా ఎమ్మెల్యేలలో ఐదుగురు ఈ ఎన్నికలలో పోటీలో ఉన్నారు.అందులో కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే డి.అనసూయ (సీతక్క) ములుగు నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. మెదక్ నుంచి పద్మాదేవేందర్ రెడ్డి, మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డి, ఆలేరు నుంచి గొంగడి సునీతా ,ఇల్లెందు నుంచి హరిప్రియా నాయక్ భారత రాష్ట సమితి అభ్యర్ధులుగా పోటీలో ఉన్నారు.

బిఆర్‌ఎస్ నుంచి పోటీలో..
బిఆర్‌ఎస్ పార్టీ నుంచి పోటీలోవున్న మహిళా అభ్యర్దుల్లో ఆసీఫాబాద్ (ఎస్టీ)నియోజకవర్గం నుంచి కోవాలక్ష్మి,మెదక్ నుంచి పద్మాదేవేందర్ రెడ్డి ,నర్సాపూర్ నుంచి సునీతా లకా్ష్మరెడ్డి, మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డి, కంటోన్మెంట్ నుంచి లాస్య నందిత, ఆలేరు నుంచి గొంగడి సునీత, ములుగు (ఎస్టీ) నుంచి బడే నాగజ్యోతి, ఇల్లెందు (ఎస్టీ) నియోజకవర్గం నుంచి హరిప్రియ నాయక్ బరిలో నిలిచారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి..
ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి విజయారెడ్డి, సనత్ నగర్ నుంచి కోట నీలిమ, గోషామహల్ నుంచి మొగలి సునీత, కంటోన్మెంట్ నుంచి జి వెన్నెల, నారాయణపేట్ నుంచి చిట్టెం పర్ణిక , గద్వాల నుంచి సరిత, కోదాడ నుంచి ఎన్ పద్మావతి రెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్ (ఎస్సీ)నుంచి సింగపురం ఇందిర, పాలకుర్తి నుంచి మామిడాల యశశ్విని, వరంగల్ తూర్పు నుంచి కొండా సురేఖ, ములుగు (ఎస్టీ)నుంచి డి.అనసూయ పోటీలో ఉన్నారు.

బిజేపి నుంచి పోటీలో..
జుక్కల్ (ఎస్సీ) నియోజకవర్గం నుంచి అరుణ తార , బాల్కొండ నుంచి ఏలేటి అన్నపూర్ణమ్మ, జగిత్యాల నుంచి బోగ శ్రావణి, రామగుండం నుంచి కందుల సంధ్యారాణి, చొప్పదండి(ఎస్సీ) నుంచి బొడిగ శోభ, సిరిసిల్ల నుంచి రాణి రుద్రమ, చార్మినార్ నుంచి మేఘారెడ్డి, వనపర్తి నుంచి అనుజ్ణరెడ్డి, అలంపూర్ (ఎస్సీ) నుంచి మేరమ్మ, నాగార్జున సాగర్ నుంచి కంకణాల నివేదిత, హుజూర్ నగర్ నుంచి చల్లా శ్రీలతారెడ్డి, డోర్నకల్ (ఎస్టీ)నుంచి భూక్యా సంగీత , వరంగల్ వెస్ట్ నుంచి రావు పద్మ, భూపాలపల్లి నుంచి చందుపట్ల కీర్తిరెడ్డి, అశ్వారావుపేట (ఎస్టీ)నుంచి ఎం.ఉమాదేవి (జనసేన) పోటీలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News