Monday, December 23, 2024

ఒడిశా రైలు ప్రమాదంలో 342 మంది ఎపి ప్రయాణికులు…

- Advertisement -
- Advertisement -

అమరావతి: సిఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో ఒడిశా రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించామని మంత్రి అమర్నాథ్ తెలిపారు. రైళ్లలో ప్రయాణించిన ప్రయాణికులలో 342 మంది ఆంధ్రప్రదేశ్ వాసులను గుర్తించామన్నారు. కోరమండల్ రైలులో 309 మంది, యశ్వంత్‌పూర్ రైలులో 33 మంది ఉన్నారని వివరించారు. ఎపి వాళ్లలో 12 మందికి స్వల్పంగా గాయపడినట్టు గుర్తించామన్నారు. 9 మందిని విశాఖకు తరలించి వైద్యం అందిస్తున్నామని, బాలసోర్‌లో నివాసం ఉంటున్న శ్రీకాకుళం జిల్లా వాసి మృతి చెందారని వివరించారు.. మృతుడి కుటుంబానికి పది లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని వెల్లడించారు.

ఎపి ప్రభుత్వ రెస్కూ ఆపరేషన్లను కేంద్రం మంత్రులు అభినందించారని, 20 అంబులెన్స్‌లు, మహాప్రస్ధానం వాహనాలను ఒడిశాలోనే ఉంచామని, ముగ్గురు ఐఎఎస్ ఆఫీసర్లు ఒడిశాలోనే ఉన్నారని చెప్పారు. ఎపికి చెందిన వారి కోసం ఫోన్ కాల్స్ రాలేదని, ఖమ్మం వ్యక్తి విజయవాడ నుంచి వెళ్తున్నట్టు కాల్ వచ్చిందని, పక్క రాష్ట్రం అయినప్పటికి సమాచారం కోసం ఆరా తీసున్నామని వెల్లడించారు. ఎపి ప్రభుత్వం చేసినంత సాయం ఏ ప్రభుత్వం చేయలేదని విమర్శించారు. బాధితులకు సేవ చేయడం ముఖ్యమని, పబ్లిసిటీ ముఖ్యం కాదని పేర్కొన్నారు. ఒడిశా రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు 288 మంది మృతి చెందగా 1000 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Also Read: యువకుడి ప్రేమ పెళ్లి…. యువతి ఆత్మహత్య

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News