Tuesday, December 3, 2024

దేశంలో కొత్తగా 34,973 కరోనా కేసులు…

- Advertisement -
- Advertisement -

34973 Corona positive cases in India

 

ఢిల్లీ: భారత దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో దేశంలో 34,973 మందికి కరోనా వైరస్ సోకగా 260 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 3.31 కోట్లకు చేరుకోగా 4.42 లక్షల మంది మృతి చెందారు. కరోనా నుంచి 3.23 కోట్ల మంది కోలుకోగా ప్రస్తుతం 3.86 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. 53.9 కోట్ల మంది కరోనా టెస్టులు చేశామని ఐసిఎంఆర్ ప్రకటించింది. ఇప్పటి వరకు దేశంలో 72.4 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రతీ రోజు ఒక్క కేరళలోని 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. వినాయకచవితి వేడుకలు ప్రారంమైనందున సామాజిక దూరం పాటించడంతో మాస్కు ధరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపాయి. ప్రజలు గుంపులు గుంపులు ఉండకూడదని హెచ్చరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News