Wednesday, January 22, 2025

35- చిన్న కథ కాదులో నీలి మేఘములలో సాంగ్ విడుదల

- Advertisement -
- Advertisement -

నివేత థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్ లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్ ‘35- చిన్న కథ కాదు’. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్, డైరెక్టర్. తాజాగా మేకర్స్ ‘నీలి మేఘములలో…’ సాంగ్ రిలీజ్ చేశారు. లీడ్ పెయిర్ జర్నీని బ్యూటీఫుల్‌గా చూపించిన ఈ పాటని వివేక్ సాగర్ లవ్లీగా కంపోజ్ చేశారు. భరద్వాజ్ గాలి రాసిన లిరిక్స్ మనసుని హత్తుకునేలా వున్నాయి. సింగర్ పృథ్వీ హరీష్ సోల్‌ఫుల్‌గా పాడిన ఈ పాట చాలా మధురంగా వుంది. ‘35- చిన్న కథ కాదు‘ సెప్టెంబర్ 6న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News