Tuesday, December 24, 2024

బుర్కినా పాసోలో ఐఇడి బాంబుతో దాడి: 35 మంది మృతి

- Advertisement -
- Advertisement -

35 civilians killed in IED blast in Burkina Faso

బుర్కినా ఫాసో: వెస్ట్ ఆఫ్రికాలోని బుర్కినా పాసో ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఐఇడి బాంబుతో దాడి చేయడంతో 35 మంది పౌరులు మృతి చెందారు. ఓ వాహనం 70 నుంచి 80 ప్రయాణికులతో జిబో నుంచి బౌర్జంగా ప్రాంతానికి వెళ్తుండగా ఐఇడి బాంబుతో దాడి చేశారు. ఈ దాడిలో 35 మంది దుర్మరణం చెందగా 37 మంది తీవ్రంగా గాయపడ్డారని గవర్నర్ రోడోల్పా సోర్ఘో తెలిపారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. బుర్కినా పాసో ప్రాంతంలో గత నెలలో ఐఇడి బాంబులతో జీహాది తీవ్రవాదులు దాడి చేయడంతో 15 మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. జీహాది తీవ్రవాదులకు అల్‌ఖైదా ఇస్లామిక్ తీవ్రవాదులతో సంబందాలున్నాయని స్థానిక మీడియా వెల్లడించింది. బుర్కినా ప్రాంతంలో 40 శాతం భూభాగంలో తీవ్రవాదుల పాలన కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News