Sunday, April 6, 2025

బంగ్లాదేశ్‎లో ఘోర అగ్నిప్రమాదం: 35 మంది మృతి

- Advertisement -
- Advertisement -

35 killed in fire at Bangladesh

ఢాకా: బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లోని సీతకుంట జిల్లాలోని ఓ ప్రైవేట్ కంటైనర్ డిపోలో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 35కి చేరింది. 450మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కాగా సహాయక చర్యల్లో పాల్గొన్న ఐదుగురు అగ్నిమాపక సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీస్ అవుట్‌పోస్ట్ సబ్-ఇన్‌స్పెక్టర్  మాట్లాడుతూ… ఈ సంఘటనపై ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, కంటైనర్ డిపోలో రసాయనాల కారణంగా మంటలు చెలరేగినట్లు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే క్రమంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు తర్వాత, మంటలు మరింత వ్యాపించాయని ఢాకా ట్రిబ్యూన్ నివేదించింది. రాత్రి 9 గంటల సమయంలో మంటలు చెలరేగినట్లు ఎస్‌ఐ నూరుల్‌ ఆలం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News