Sunday, January 19, 2025

దాంతెవాడ జిల్లాలో 35 మంది నక్సలైట్లు లొంగుబాటు

- Advertisement -
- Advertisement -

దాంతెవాడ: ఛత్తీస్‌గఢ్‌లోని దాంతెవాడ జిల్లాలో ఆదివారం 35 మంది నక్సలైట్లు లొంగిపోయినట్లు పోలీస్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. వారిలో ముగ్గురిపై రూ.3 లక్షల రివార్డ్ కూడా ఉంది. పోలీసుల ముందు లొంగిపోయిన నక్సలైట్లలో 16 ఏళ్ల బాలిక, 18 ఏళ్ల బాలుడు కూడా ఉన్నట్లు ఆయన తెలిపారు. షట్‌డౌన్లకు నక్సలైట్లు పిలుపు ఇచ్చినప్పుడు రోడ్లు తవ్వడం, రోడ్లపై అడ్డంగా చెట్టను పడవేయడం, పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేయడం వంటి పనులను ఆ శ్రేణులకు అప్పగిస్తుంటారని అధికారి తెలియజేశారు.

పోలీసులు ‘లాన్ వర్రట్టు’ (సొంత ఇంటికి తిరిగి రావడం) పునరావాస కార్యక్రమం తమను ఆకట్టుకున్నదని, మావోయిస్ట్ నిస్తేజ సిద్ధాంతంతో తాము నిరాశ చెందామని వారు చెప్పినట్లు దాంతెవాడ ఎస్‌పి గౌరవ్ రాయ్ తెలియజేశారు. ప్రభుత్వ లొంగుబాటు, పునరావాస విధానం ప్రకారం ఆ నక్సలైట్లకు సౌకర్యాలు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆ 35 మందితో కలిపి 796 మంది నక్సలైట్లు ఇప్పటి వరకు జిల్లాలో ప్రధాన స్రవంతిలో చేరినట్లు అధికారులు తెలియజేశారు. పోలీసులు లాన్ వర్రట్టు ప్రచార కార్యక్రమాన్ని 2020 జూన్‌లో ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News