Monday, November 25, 2024

ఆదివారం నాటికి హజ్ యాత్రకు 35 బృందాలు

- Advertisement -
- Advertisement -
22న జిద్దాకు చివరి ఫ్లైట్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం నుండి హజ్ యాత్రికుల రవాణా కొనసాగుతోంది. ఆదివారం 600 మంది హజ్ పిలిగ్రిమ్స్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి నాలుగు ప్రత్యేక విమానాల్లో జిద్దాకు బయలు దేరారు. హైదరాబాద్ హజ్ హౌస్‌లో హజ్ యాత్రికుల బృందానికి రాష్ట్ర హజ్ కమిటి చైర్మన్ మొహమ్మద్ సలీం జెండా ఊపి ప్రారంభించారు. హజ్ యాత్ర ప్రారంభమైన జూన్ 7వ తేదీ నుంది 18వ తేదీ వరకు రాష్ట్రం నుండి మొత్తం 5,250 మంది హజ్ యాత్రికులు 35 ప్రత్యేక విమానాల ద్వారా జిద్దాకు బయలుదేరి వెళ్ళారు. సోమవారం రెండు ప్రత్యేక విమానాల్లో 300 మంది యాత్రికులు బయలు దేరనున్నారు.

ఈ నెల 22న హజ్ యాత్రికుల చివరి విమానం జిద్దాకు బయలు దేరనుంది. కాగా సోమవారం హజ్‌కు వెళ్ళనున్న వారిలో హైదరాబాద్ నుండి 13 మంది, మహబూబ్‌నగర్ నుండి 8, రంగారెడ్డి జిల్లా నుంచి 222 మంది, కరీంనగర్ నుంచి 5గురు, నల్గొండ నుంచి 8 మంది, నిజామాబాద్ 2, నిర్మల్ 4, ఆసిఫాబాద్ నుంచి ఒకరు, జగిత్యాల నుంచి 5, కామారెడ్డి నుంచి 4, సంగారెడ్డి 5, వనపర్తి 10, గద్వాల నుంచి ఇద్దరు, మేడ్చల్ నుంచి 5 గురు, నాందేడ్ నుంచి 6 గురు హజ్ యాత్రకు వెళ్ళనున్నారు. కర్నాటక హజ్ కమిటి చైర్మన్ మొహమ్మద్ రవుఫుద్దీన్ కచేరివాలా రాష్ట్ర హజ్ కమిటి కార్యాలయాన్ని సందర్శించారు. కర్నాటక కు చెందిన హజ్ పిలిగ్రిమ్స్ సోమవారం హైదరాబాద్ నుండి వెళుతున్న సందర్భంగా వారిని సెండాఫ్ చెప్పడానికి ఆయన హైదరాబాద్ వచ్చారు. కాగా నేటి కార్యక్రమంలో తెలంగాణ హజ్ కమిటి సభ్యులు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేని, సయ్యద్ ఇర్ఫానుల్ హఖ్, ( కరీంనగర్), జాఫర్ ఖాన్ (గజ్వేల్), సయ్యద్ నిజాముద్దీన్ (నార్సింగి), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ అధికారి ఇర్ఫాన్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News