Monday, November 25, 2024

రూ.35 వేల కోట్ల భారత ఈక్విటీలు ఎఫ్‌పిఐల వశం

- Advertisement -
- Advertisement -

రూ.35 వేల కోట్ల భారత ఈక్విటీలు ఎఫ్‌పిఐల వశం

మార్చిలో నమోదు

న్యూఢిల్లీ : కాస్త ఆలస్యంగా విక్రయాలు జరిగినప్పటికీ విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐలు) రూ. 35098 కోట్లు విలువ చేసే ఈక్విటీ కొనుగోళ్లతో మార్చిలో నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. అంతకు ముందు రెండు నెలల పేలవ ప్రదర్శనను మార్చి నెల కొనుగోళ్లు అధిగమించాయి. క్యాపిటల్ గూడ్స్, ఆటోమొబైల్స్, ఫైనాన్షియల్స్, టెలికమ్, రియల్ ఎస్టేట్ రంగాలలో భారీ కొనుగోళ్లు సాగడం అందుకు దోహదం చేసింది. 2024లో ఇంత వరకు ఎఫ్‌పిఐలు రూ. 10893 కోట్లు విలువ చేస్తే దేశీయ వాటాలు కొనుగోలు చేశారు. జనవరిలో వారు నెట్ విక్రేతలు. వారు రూ. 25744 కోట్లు విలువ చేసే ఈక్విటీలు విక్రయించారు. వారు ఫిబ్రవరిలో రూ. 1539 కోట్లు విలువ చేసే వాటాలు కొనుగోలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News