Wednesday, January 22, 2025

రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న వైమానిక సిబ్బంది

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ఎయిర్ ఫోర్స్ సిబ్బంది విమానాలు నడిపేందుకు శిక్షణ తీసుకున్న రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నారని హైదరాబాద్ ట్రాఫిక్ డిసిపి రాహుల్ హెగ్డె అన్నారు. రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై వైమానిక దళ శిక్షణ సంస్థ బోయినపల్లిలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో డిసిపి రాహుల్ హెగ్డె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శత్రువులతో పోరాటంలో మృతిచెందిన వారికంటే రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువమంది ఎయిర్ ఫోర్స్ సిబ్బంది మృతిచెందడం, గాయపడడం జరుగుతోందని తెలిపారు.

గత ఏడాది దేశవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 350మంది వైమానిక సిబ్బంది మృతిచెందారని తెలిపారు. విమానాలు నడపడం కోసం శిక్షణ పొందిన అధికారులు రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందడం బాధకరమని తెలిపారు. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు గ్రూప్ కెప్టెన్ మనీష్‌కుమార్, గ్రూప్ కెప్టెన్ సుమన్ కుమార్, లెఫ్టినెంట్ కల్నల్ రాకేష్ చంద్ర ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. ట్రాఫిక్ నియమాల గురించి ట్రాఫిక్ శిక్షణ సంస్థ ఇన్స్‌స్పెక్టర్ నాగరాజు ఎయిర్ ఫోర్స్ సిబ్బందికి వివరించారు. కార్యక్రమంలో తిరుమలగిరి ఇన్స్‌స్పెక్టర్ పురుషోత్తంరావు, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది, అధికారులు శ్రీసోలంకి, రాబర్ట్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News