Tuesday, November 5, 2024

పేటిఎమ్‌తో 350 మంది కోటీశ్వరులు

- Advertisement -
- Advertisement -
350 millionaires with Paytm
18న స్టాక్ మార్కెట్ లిస్టింగ్‌తో భారీగా లాభపడనున్న ఉద్యోగులు

ముంబయి: ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే అతినెద్ద ఐపిఓగా పేటిఎమ్ పబ్లిక్ ఇష్యూ నిలిచింది. రూ.18,300 కోట్లు సమీకరించడమే లక్ష్యంగా ఈ నెల 8న ప్రారంభమైన ఈ ఐపిఓ సబ్‌స్క్రిప్షన్ 10న ముగిసింది. 18న స్టాక్ మార్కెట్ సూచీల్లో నమోదు కానుంది. ఒక్కో షేరు తుది ధరను కంపెనీ రూ.2,150గా నిర్ణయించింది. దీంతో నవంబర్ 18న స్టాక్ మార్కెట్లో లిస్టయిన వెంటనే భారత్‌లో దాదాపు 350 మంది కోటీశ్వరులుగా మారనున్నారు. పేటిఎమ్‌లో గతంలో పని చేసిన, ప్రస్తుతం ఉద్యోగులుగా ఉన్న దాదాపు 350 మంది నవంబర్ 18న కోటీశ్వరులుగా అవతరించనున్నారు.

వీళ్లంతా గతంలో ఎంప్లాయిస్ స్టాక్స్ ఆప్షన్ కింద పేటిఎమ్ షేర్లు పొందిన వారే. వీరిలో చాలా మందికి పేటిఎమ్‌లో భారీ ఎత్తున షేర్లు ఉండడమే దీనికి కారణం. కంపెనీ నిర్ణయించిన రూ.2,150 చొప్పున వీరి సంపద విలువ రూ.కోటిని దాటనుంది. ఈ సందర్భంగా గతంలో పేటిఎంలో పని చేసిన సిద్ధార్థ పాండే అనే ఎలక్ట్రానిక్ ఇంజనీర్‌తన అనుభవాన్ని పంచుకున్నారు.‘ పేటిఎంలో పనిచేస్తున్నానని తెలిసి మా నాన్న చాలా నిరాశకు గురయ్యారు. ఏంటీ‘ పేటిఎమ్’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. కానీ ఆయన ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. అంతేకాదు, ఇప్పుడు దానిలోనే ఉండిపో అని చెప్తున్నారు’ అని తెలిపారు. కానీ సిద్ధార్థ్ పాండే ప్రస్తుతం పేటిఎమ్ వదిలేసి మరో అంకుర సంస్థలో పని చేస్తున్నారు. సిద్ధార్థ్ పాండే లాంటి వారు దాదాపు 350 మంది ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News