Wednesday, January 22, 2025

మధిరలో గ్రూప్ -4 ఎగ్జామ్ రాయనున్న 3505 మంది అభ్యర్థులు

- Advertisement -
- Advertisement -

మధిర : రాష్ట్ర వ్యాప్తంగా శనివారం జరగనున్న గ్రూప్ -4 పరీక్షకు మధిర పట్టణంలో మొత్తం 13 పరీక్షా కేంద్రాలలో 3504 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని, ఎంఈఓ వై.ప్రభాకర్ శుక్రవారం విలేకరులకు తెలిపారు. మండల పరిధిలోని సిరిపురం గ్రామంలోని ప్రభుత్వ హైస్కూల్‌లో 240, అదేవిధంగా ఆత్కూర్ వద్దనున్న శ్రీనిధి హై స్కూల్‌లో 312 అభ్యర్థులు గ్రూప్ -4 పరీక్షలు రాయనున్నారు. పట్టణంలోని టీవీఎం హై స్కూల్‌లో 216, వైరా రోడ్ లేదు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 240, హరిజనవాడలోని హైస్కూల్‌లో 192, సీప్స్‌లో 192, మిలీనియం టాలెంట్ హై స్కూల్‌లో 240, భరత్ విద్యానికేతన్‌లో 288, ఠాగూర్ హై స్కూల్‌లో 240, శీలం పుల్లారెడ్డి డిగ్రీ కళాశాలలో 336,

నారాయణ బెస్ట్ ఫౌండేషన్ హై స్కూల్ లో 360, శ్రీ చైతన్య స్కూల్‌లో 240, సెయింట్ ఫ్రాన్సిస్ హై స్కూల్‌లో 408 మంది గ్రూప్ -4 పరీక్షలు రాయనున్నారు. ఆయా పరీక్ష కేంద్రాల్లో పరీక్ష రాసే అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు, పరీక్షా కేంద్రాల వద్దకు అభ్యర్థులు సకాలంలో చేరుకోవాలని, ఎంఈఓ వై.ప్రభాకర్ ఈ సందర్భంగా తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ లతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు మధిర సిఐ మురళి తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి సుమారు 3504 మంది గ్రూప్ -4 పరీక్ష వ్రాసేందుకు శనివారం ఉదయం మధిర పట్టణ కి రానున్నారని, వీరికి సెంటర్లను తెలిపే విధంగా రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ లతో పాటు, పట్టణంలోని వివిధ కూడల్లలో, పోలీసులతోనూ వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వాహకులతోను హెల్ప్ సెంటర్ ఏర్పాటు చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News