Thursday, December 19, 2024

డిస్టిలరీల నుంచి రూ. 353 కోట్ల నగదు స్వాధీనం

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: పన్ను ఎగవేత ఆరోపణలపై ఒఢిశాకు చెందిన ఒక డిస్టిలరీ గ్రూపుపై ఆదాయం పన్ను శాఖ నిర్వహిస్తున్న సోదాలు సోమవారం ఆరవ రోజుకు ప్రవేశించాయి. ఇప్పటివరకు లెక్కల్లో చూపని రూ. 353 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఐటి అధికారులు వెల్లడించారు. దేశంలోని ఐటి శాఖ దర్యాప్తులో ఇంత భారీ మొత్తంలో నగదు పట్టుబడడం ఇదే మొదటిసారని వారు చెప్పారు. ఒక కాంగ్రెస్ ఎంపి కుటుంబానికి చెందిన బౌధ్ డిస్టిలరీకి చెందిన సుదాపాడలోని ప్రాంగణం చేరుకున్న ఐటి అధికారులు సోదాలు కొసాగిస్తున్నారు. డిసెంబర్ 6న మొదలైన సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సంబల్‌పూర్, టిట్టాగఢ్, సుందర్‌గఢ్, బోలన్‌గిర్, భువేశ్వరలోని డిస్టిలరీకి చెందిన కార్యాలయాలలో సోదాలు జరిగినట్లు అధికారులు తెలిపారు.

ఐటి అధికారల బృందంతో వచ్చిన ఐటి నిపుణులు స్వాధీనం చేసుకున్న కీలక పత్రాలపై దృష్టి సారించినట్లు వారు చెప్పారు. ఆదివారం రాత్రికి నగదు లెక్కింపు పూర్తయిందని వారు తెలిపారు. ఆదివారం రాత్రి వరకు రూ. 353 కట్లో నగదును లెక్కించి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వివరించారు. కాగా&డిస్టిలరీలలో ఇంత భారీ మొత్తంలో నగదు లభించిన నేపథ్యంలో ఒడిశాలోని అధికార బిజెడిపై బిజెపిపై విమర్శల దాడిని ఉధృతం చేసింది. రాష్ట్రంలో అక్రమ మద్యం వ్యాపారాన్ని బిజెడి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, తద్వారా నల్ల ధనాన్ని సంపాదించుకుంటోందని బిజెపి ఆరోపించింది. నల్ల ధనం లావాదేవీలను నిరసిస్తూ బిజెపి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ డివిజన్లలో సోమవారం ప్రదర్శనలు నిర్వహించింది. రాష్ట్రంలో లిక్కర్ మాఫియా చెలరేగిపోవడానికి ఒడిశా ప్రభుత్వం అమలు చేస్తున్నఎక్సైజ్ విధానమే కారణమని బిజెపి ఆరోపించింది. లిక్కర్ మాఫియాకు ప్రయోజనాలు చేకూరుస్తూ తద్వారా లభించే నల్లధనంతో బిజెడి ఎన్నికల్లో పోటీచేస్తోందని బిజెపి ఒడిశా విభాగం అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ ఎక్స్ మాధ్యమంలో ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News